తేజ సజ్జ (Teja Sajja) , ప్రశాంత్ వర్మ (Prashanth Varma) కాంబినేషన్లో రూపొందిన ‘హనుమాన్’ (Hanu Man) మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 11న వేసిన ప్రీమియర్ షోలతో బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ ఆ తర్వాత షోలు, స్క్రీన్స్ పెంచుకుంటూ భారీ కలెక్షన్స్ ను నమోదు చేసింది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా తర్వాత బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది.
కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సినిమా బయ్యర్స్ కి లాభాలు పంచింది అని చెప్పాలి. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 38.78 cr |
సీడెడ్ | 11.90 cr |
ఉత్తరాంధ్ర | 12.00 cr |
ఈస్ట్ | 8.13 cr |
వెస్ట్ | 4.53 cr |
గుంటూరు | 5.36 cr |
కృష్ణా | 4.75 cr |
నెల్లూరు | 2.58 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 88.03 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 12.35 cr |
హిందీ | 25.00 cr |
ఓవర్సీస్ | 29.30 cr |
వరల్డ్ వైడ్( టోటల్) | 154.568 cr (షేర్) |
‘హనుమాన్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.28.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.28.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.154.68 కోట్ల షేర్ ను రాబట్టి… బయ్యర్స్ కి రూ.126.18 కోట్ల లాభాలు అందించి ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.