రెండు తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ మూవీ రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా టికెట్ రేట్లు సైతం పరిమితంగా ఉన్నాయని తెలుస్తోంది. హైదరాబాద్ లోని మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాకు 295 రూపాయలు గరిష్టంగా ఉండగా హైదరాబాద్ లోని సింగిల్ స్క్రీన్స్ లో ఈ సినిమాకు 150 రూపాయలు టికెట్ రేట్ గా ఉంది.
తెలంగాణలోని సింగిల్ స్క్రీన్స్ లో 110 రూపాయలు టికెట్ రేటుగా ఉందని భోగట్టా. ఏపీలో కూడా ఈ సినిమాకు సాధారణ టికెట్ రేట్లు అమలు కానున్నాయని సమాచారం అందుతోంది. పండుగకు సాధారణ టికెట్ రేట్లతో రిలీజ్ కావడం కంటే హనుమాన్ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమా ప్రదర్శించబడే థియేటర్ల జాబితా సైతం న్యూస్ పేపర్లలో వైరల్ అవుతుండటం గమనార్హం.
గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు ఈ నెల 12వ తేదీన రిలీజ్ కానుండగా ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించి 2024 సంవత్సరానికి శుభారంభాన్ని ఇవ్వాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. హనుమాన్ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో స్క్రీన్స్ లభించాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. హనుమాన్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాల్సి ఉంది.
హనుమాన్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం జోరుగా జరిగే ఛాన్స్ అయితే ఉంది. తేజ సజ్జా హనుమాన్ సినిమాతో సక్సెస్ సాధిస్తే మిడిల్ రేంజ్ హీరోలలో ఆయన స్థాయి పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. హనుమాన్ సినిమా కోసం ఇతర భాషల అభిమానులు సైతం ఒకింత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. హనుమాన్ మూవీ రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!