ఇండియన్ 3ని డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు!

శంకర్ (Shankar) బ్రాండ్ ఇమేజ్ ను నాశనం చేసిన సినిమా “ఇండియన్ 2” (Indian 2) . సినిమా మొత్తానికి ఒక్కటంటే ఒక్క పాజిటివ్ సీన్ కూడా ఉండదు. సినిమా మొత్తం మంచి ట్రోల్ మెటీరియల్ లా ఉంటుంది. ఏళ్ల తరబడి శంకర్ బిల్డ్ చేసుకున్న ఇమేజ్ మొత్తం ఆ ఒక్క సినిమాతో మట్టికొట్టుకుపోయింది. అప్పటికే.. సినిమా చూసి నీరసించిపోయిన ప్రేక్షకుల నెత్తిన పిడుగు పడ్డట్లు “పార్ట్ 3” ట్రైలర్ ప్లే చేయగానే మరింత కోప్పడ్డారు జనాలు.

Indian 3

నిజానికి షూటింగ్ పూర్తయిపోయి, పోస్ట్ ప్రొడక్షన్ లో మెరుగులు దిద్దుకుంటున్న “ఇండియన్ 3”ని (Indian 3) 2025 సమ్మర్ లో థియేటర్లలో విడుదల చేద్దామనుకున్నాడు శంకర్. అయితే.. “ఇండియన్ 2” పుణ్యమా అని “ఇండియన్ 3”కి కనీస స్థాయి బజ్ లేకుండాపోయింది. దాంతో ఈ సినిమాను విడుదల చేయడం అవసరమా అనే మీమాంసలో పడిపోయారు నిర్మాతలు. ఇప్పుడు ఆ నిర్మాతల నెత్తిన పాలు పోసినట్లు..

“ఇండియన్ 3” డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి మంచి ఆఫర్ ఇచ్చింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. దాదాపుగా “ఇండియన్ 2” సినిమాకి వచ్చిన నష్టాలన్నీ కవర్ అయిపోయే ప్యాకేజీ ఆఫర్ చేసిందట. పార్ట్ 3ని థియేటర్లలో విడుదల చేసినా ఆ స్థాయి డబ్బులు వస్తాయన్న నమ్మకం లేకపోవడంతో.. ఈ డీల్ ను కన్సిడర్ చేస్తున్నారట నిర్మాతలు. ఒకపక్క శంకర్ “గేమ్ ఛేంజర్” డిసెంబర్ 20 విడుదలకు సిద్ధమవుతుండగా..

ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన “ఇండియన్ 3” ఇలా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలయ్యేందుకు చర్చలు జరగడం చర్చనీయాంశం అవుతోంది. మరి శంకర్ ఈ డెసిషన్ ను ఒప్పుకుంటాడా లేక థియేట్రికల్ రిలీజ్ కంపల్సరీ అని మొండిపట్టు పడతాడా అనేది వేచి చూడాలి. ఇకపోతే.. “ఇండియన్ 3″లో కాజల్ కూడా ఉండడంతో సినిమాకి మంచి గ్లామర్ యాడ్ అయ్యింది.

మారిపోయానంటున్న శ్రీను వైట్ల.. కొత్త కామెడీ చూస్తారంటూ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus