టాలీవుడ్‌లో అత్యంత ఎక్కువ కాలంగా నిర్మాణంలో ఉన్న చిత్రాల్లో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) ఒకటి. ఏకంగా ఐదేళ్లుగా వివిధ కారణాలతో ఈ సినిమా వాయిదా పడుతూనే వచ్చింది. మొదట క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రత్నం (AM Rathnam) కుమారుడు జ్యోతిక్రిష్ణ (Jyothi Krishna ) ఫినిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ బడ్జెట్ భారీగా పెరిగిపోయిందని, దాన్ని రికవర్ చేసుకోవాలంటే భారీ వసూళ్లు రావాల్సిన అవసరం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక మార్చి 28న సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ వర్క్ పూర్తిగా కంప్లీట్ కాలేదని, ఆ డేట్‌కు రాబోతుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 350 కోట్ల గ్రాస్ సాధించాల్సిన అవసరం ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలు వకీల్ సాబ్ (Vakeel Saab), భీమ్లా నాయక్ (Bheemla Nayak) కనీసం 170 కోట్ల వరకు కూడా వెళ్లలేకపోయాయి. ఇక 350 కోట్ల మార్క్ అందుకోవడం పెద్ద సవాల్‌గా మారింది.
అయితే ఈసారి మాత్రం హరిహర వీరమల్లు పూర్తిగా వేరే జానర్ కావడం స్పెషల్‌గా మారింది. సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవ్వడంతో పాటు, హిందీ మార్కెట్‌పై ఫోకస్ పెంచినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే హవాను సినిమాకు ఉపయోగించుకునేందుకు మేకర్స్ ప్రోమోషన్స్‌ను ప్లాన్ చేస్తున్నారట. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, సినిమా మొదటి రోజే 80-120 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది. కానీ అంత ఓపెనింగ్స్ రావాలి అంటే ముందుగా ట్రైలర్ తో పాటు వరుస అప్డేట్స్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేశాయి.
సినిమా సక్సెస్ కావాలంటే కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉండాల్సిందే. హిందీ మార్కెట్‌లో నిలదొక్కుకోవాలంటే విజువల్ గ్రాండియర్, ట్రైలర్ ఇంపాక్ట్, మ్యూజిక్ అన్నీ హై స్టాండర్డ్‌లో ఉండాలి. ఈ సినిమా మొదటి భాగం హిట్ అయితేనే సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్ దొరికే అవకాశం ఉంటుంది. బడ్జెట్ పెరిగిన నేపథ్యంలో సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందనేది పవన్ కళ్యాణ్ మార్కెట్‌పై కూడా డిపెండ్ అవుతుంది. రాజకీయంగా పవన్ స్ట్రాంగ్ ఇమేజ్ ఉన్నా, అదే రేంజ్ వసూళ్లకు కన్‌వర్ట్ అవుతుందా అనేది చూడాలి.