Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ కి ఫిక్స్.. మరి ‘#VD12’ సంగతేంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  పూర్తి చేయాల్సిన సినిమాల్లో ‘హరిహర వీరమల్లు’  (Hari Hara Veera Mallu) ఒకటి. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం ‘హరిహర వీరమల్లు పార్ట్ 1 : స్వర్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్  (Krish Jagarlamudi)  దర్శకత్వంలో మొదలైన ఈ ప్రాజెక్టుకి తర్వాత నిర్మాత ఏ.ఎం.రత్నం  (AM Rathnam) కొడుకు జ్యోతి కృష్ణ  (Jyothi Krishna ) దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. నిధి అగర్వాల్ (Nidhhi Agerwal)  హీరోయిన్ కాగా బాబీ డియోల్ (Bobby Deol) , అనుపమ్ ఖేర్ (Anupam Kher)  సచిన్ కేడెకర్ (Sachin Khedekar) వంటి స్టార్లు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

Hari Hara Veera Mallu:

సెప్టెంబర్ 23 అంటే ఈరోజు నుండి ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. సినిమాలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తారు. ఇక ఇదే రోజున ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు మేకర్స్.2025 మార్చి 28న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

ఓ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే అదే డేట్ కి.. ‘#VD12’ కూడా విడుదల కాబోతున్నట్లు ఆ సినిమా మేకర్స్ ప్రకటించడం జరిగింది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై నాగ వంశీ నిర్మిస్తున్న ఆ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. విజయ్ దేవరకొండ లుక్ కూడా సరికొత్తగా ఉంది.

అది కూడా పాన్ ఇండియా మూవీనే..! వరుస ప్లాపులతో రేసులో వెనుకపడ్డ విజయ్.. ఈ సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అయితే పోటీగా పవన్ కళ్యాణ్ సినిమా కనుక రిలీజ్ అయితే విజయ్ సినిమాకి ఓపెనింగ్స్ కష్టం. కాబట్టి.. ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదు అంటే.. విజయ్ సినిమా రావట్లేదు కాబట్టే ‘వీరమల్లు’ ని ఆ డేట్ కి అనౌన్స్ చేసి ఉండొచ్చు.

డైరెక్టర్ లేని టైమ్ చూసుకుని 8 నిమిషాలు ట్రిమ్ చేశాడట.. కట్ చేస్తే.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus