పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రం ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయ్యింది. అది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ అభిమానుల్లో ఈ సినిమాపై ఆశలు కూడా సన్నగిల్లాయి అని చెప్పాలి. క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాని చివరికి నిర్మాత ఏ.ఎం.రత్నం (AM Rathnam) కుమారుడు రత్నం కృష్ణ (Jyothi Krishna) కంప్లీట్ చేశాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేయాల్సిన బ్యాలెన్స్ షూటింగ్ కూడా ఫినిష్ అయ్యింది. మరి రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
మే 30న రిలీజ్ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ వాయిదా పడినట్టు టాక్ నడుస్తుంది. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఓటీటీ డీల్ ను క్యాన్సిల్ చేయడానికి రెడీ అవ్వడం వల్ల.. నిర్మాత ఏ.ఎం.రత్నం వాళ్ళని కన్విన్స్ చేయడానికి వెళ్లారు. మొత్తానికి వాళ్ళని కన్విన్స్ చేసి మరో 2 వారాల పాటు గడువు తీసుకున్నట్లు తెలుస్తుంది. అంటే జూన్ 12న ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు స్పష్టమవుతుంది.
జూన్ నెలలో పెద్దగా చెప్పుకోదగ్గ రిలీజ్ సినిమాలు అయితే లేవు. ఆ రకంగా చూసుకుంటే ‘హరిహర వీరమల్లు’ కి ఒక అడ్వాంటేజ్ ఉన్నట్టు. కానీ సమ్మర్ సీజన్ ను మిస్ చేసుకోవడం వల్ల.. భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టే ఛాన్స్ కూడా మిస్ అయ్యి ఉండవచ్చు. ఇక నిథి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అనసూయ, పూజిత పొన్నాడ, బాబీ సింహా వంటి స్టార్స్ నటించారు.