Pawan Kalyan: ఆ సెంటిమెంట్ ప్రకారం వీరమల్లు బ్లాక్ బస్టర్!

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవగా ఈ సినిమాలు విడుదలై పది రోజులైనా ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ఈ రెండు సినిమాల టైటిల్స్ లో వీర ఉన్న సంగతి తెలిసిందే. అయితే పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు టైటిల్ లో కూడా వీర అనే పదం ఉంది.

ఈ ఏడాది వీర అనే పదం టైటిల్స్ లో ఉన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన నేపథ్యంలో హరిహర వీరమల్లు మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. హరిహర వీరమల్లు మూవీ ఏకంగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా మరో రెండు రోజుల్లో ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ కానుంది. టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

హరిహర వీరమల్లు మూవీ ఎప్పుడు విడుదలైనా ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. క్రిష్ ఈ సినిమాతో మరోసారి తన ప్రతిభను ప్రూవ్ చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. ఏఎం రత్నం రాజీ పడకుండా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.

హరిహర వీరమల్లు మూవీకి సోలో రిలీజ్ దక్కే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. హరిహర వీరమల్లులో బాలీవుడ్ ప్రముఖ నటులు కూడా నటించిన నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus