పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ‘హరిహర వీరమల్లు’ కోసం ఆయన మళ్ళీ మేకప్ వేసుకున్నారు. పనిలో పనిగా మిగిలిన 2 సినిమాలను కూడా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఇక ‘హరిహర వీరమల్లు’ మరో 2 రోజుల్లో అంటే జూలై 24న రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమా పవన్ అభిమానులకు చాలా స్పెషల్. ఎందుకంటే పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా కావడం. అలాగే రీ ఎంట్రీలో పవన్ చేస్తున్న స్ట్రైట్ మూవీ కావడంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ట్రైలర్ తర్వాత ఈ సినిమాపై ఉన్న అంచనాలు కూడా పటాపంచలు అయ్యాయి. అలాగే ‘గేమ్ ఛేంజర్’ తర్వాత ఈ ఏడాది వస్తున్న పెద్ద సినిమా ‘హరిహర వీరమల్లు’నే.! దీంతో థియేటర్స్ కు పెద్ద ఎత్తున ప్రేక్షకులు కదిలి వచ్చే అవకాశం లేకపోలేదు.
ఆల్రెడీ ‘హరిహర వీరమల్లు’ సినిమాని నిర్మాత ఏ.ఎం.రత్నం, పవన్ కళ్యాణ్ కళ్యాణ్ కలిసి కొంతమంది స్నేహితులకు అలాగే రాజకీయవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు చూపించినట్టు సమాచారం. సినిమా చూశాక వాళ్ళు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం.. ‘హరిహర వీరమల్లు’ మొదటి 15 నిమిషాలకే అందరూ కథలో ఇన్వాల్వ్ అయిపోతారట. దాదాపు 20 నిమిషాల తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటుందట.ఆ తర్వాత ప్రేమ కథ, కామెడీ సన్నివేశాలు వస్తాయట.
ఇంటర్వెల్ సీక్వెన్స్ వద్ద వచ్చే ఒక ఫైట్ అందరినీ ఆకట్టుకుంటుంది అని అంటున్నారు. సెకండాఫ్ లో వచ్చే 2 యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటాయట. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ గూజ్ బంప్స్ తెప్పిస్తుంది అని అంటున్నారు. మధ్యలో వచ్చే కొన్ని ఎమోషనల్ ఎపిసోడ్స్, పొలిటికల్ సెటైర్స్, సనాతన ధర్మం గురించి వచ్చే డైలాగులు పవన్ వీరాభిమానులు మెచ్చే విధంగా ఉంటాయని చెబుతున్నారు. చూడాలి మరి మార్నింగ్ షోల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో..!