పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో మొదటి పాన్ ఇండియా సినిమాగా రూపొందింది ‘హరిహర వీరమల్లు’. 2020 లో క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా మొదలైంది. నిధి అగర్వాల్ హీరోయిన్. దాదాపు 80 శాతం షూటింగ్ ను క్రిష్ డైరెక్ట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉండటం.. దీంతో పాటు కమిట్ అయిన వేరే సినిమాలకు డేట్స్ ఇవ్వడం వంటివి నచ్చకో ఏమో కానీ.. ఈ ప్రాజెక్టు నుండి క్రిష్ తప్పుకున్నాడు. ఆ తర్వాత బ్యాలెన్స్ షూటింగ్ ను నిర్మాత ఏ.ఎం.రత్నం పెద్ద కుమారుడు జ్యోతి కృష్ణ అలియాస్ రత్నం కృష్ణ కంప్లీట్ చేశారు.
జూలై 24న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. దాదాపు 2 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న సినిమా ఇది. అయితే మొదటి నుండి ‘హరిహర వీరమల్లు’ ప్రాజెక్టు పై పవన్ అభిమానులకి సైతం ఆసక్తి లేదు. 5 ఏళ్ళ పాటు ఈ సినిమా సెట్స్ పై ఉండటం, క్రిష్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడం తర్వాత అసలు ఇమేజ్ లేని జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం.. వంటివి మిక్స్డ్ ఒపీనియన్స్ కి దారి తీశాయి. ఓ దశలో పవన్ ‘హరిహర వీరమల్లు’ సినిమాను పక్కన పెడితేనే బెటర్ అని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ పవన్ కు ఈ సినిమా కథ నచ్చింది.
కంప్లీట్ చేయాలనుకున్నారు. చేశారు.! కానీ హైప్ క్రియేట్ అవ్వడానికి ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు టైం పట్టింది. ట్రైలర్ వల్ల సినిమా చూడాలి అనే ఆసక్తి అయితే అభిమానులకు మాత్రమే కాదు అందరికీ కలిగింది. ఇలాంటి సినిమాకి టికెట్ రేట్లు పెంచడం అవసరమా.? హిట్ టాక్ వస్తే కచ్చితంగా మంచి వసూళ్లు వస్తాయి. లేదు అంటే ఓపెనింగ్స్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. వీక్ డేస్ లో టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటే వచ్చే ఆడియన్స్ కూడా ఆగిపోతారు.
అందుతున్న సమాచారం ప్రకారం.. ‘హరిహర వీరమల్లు’ సినిమాకి జూన్ 23 నుండి ప్రీమియర్స్ వేసే ఆలోచన మేకర్స్ కి ఉందట. టికెట్ రేట్లు కూడా పెంచనున్నారు అని టాక్. సింగిల్ స్క్రీన్స్ లో రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.250 వరకు పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తంగా ప్రీమియర్ షోలకు రూ.600 వరకు టికెట్ రేట్లు ఉండే అవకాశం ఉంది. 10 రోజుల వరకు ఇవే హైక్స్ ఉంటాయని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.