HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

Advertisement

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన చారిత్రాత్మక సినిమా ‘హరిహర వీరమల్లు’. జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాని నిర్మాత ఏ.ఎం.రత్నం పెద్ద కుమారుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా మొదలైంది. కానీ జ్యోతి కృష్ణ కొన్ని కీలక మార్పులు చేశారు. అవి ఒక రకంగా సినిమాకి మైనస్ గా మారాయని చెప్పాలి. మొదటి రోజు సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.

HariHara Veeramallu Collections

అయినప్పటికీ మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ 2వ రోజు కలెక్షన్స్ చాలా వరకు తగ్గాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే  :

నైజాం 12.08 cr
సీడెడ్ 6.35 cr
ఉత్తరాంధ్ర 5.04 cr
ఈస్ట్ 3.79 cr
వెస్ట్ 2.99 cr
గుంటూరు 3.73 cr
కృష్ణా 2.99 cr
నెల్లూరు 1.33 cr
ఏపీ+తెలంగాణ 38.3 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.3 cr
ఓవర్సీస్ 5.4 cr
వరల్డ్ టోటల్ 47 cr (షేర్)

 

‘హరిహర వీరమల్లు’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.121 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా రూ.47 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.75 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.74 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వర్షాలు, నెగిటివ్ టాక్ ఎఫెక్ట్, వర్కింగ్ డే … వంటి కారణాల వల్ల ‘హరిహర వీరమల్లు’ రెండో రోజు కలెక్షన్స్ బాగా తగ్గాయి.

 

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తను శ్రీ దత్తా సంచలన కామెంట్లు

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus