పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా నిన్న అంటే జూన్ 24న రిలీజ్ అయ్యింది. జూన్ 23 నైట్ నుండి ప్రీమియర్స్ వేశారు. అయితే ప్రీమియర్స్ నుండే సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కంటెంట్ బాగున్నప్పటికీ డైరెక్షన్ చాలా బ్యాడ్ గా ఉందని.. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ అయితే చాలా నాసిరకంగా ఉందని.. ఎక్కువ శాతం ఆడియన్స్ విమర్శించారు.
అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. రూ.41.83 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేసింది. అసలే బజ్ లేని సినిమా,అలాగే నెగిటివ్ టాక్ ఎఫెక్ట్, పైగా ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలు వంటి ప్రతికుల పరిస్థితుల్లో కూడా ఈ రేంజ్లో కలెక్షన్స్ నమోదు చేయడం అంటే చిన్న విషయం కాదు. మరి 2వ రోజు సంగతేంటి?
ఈరోజు కూడా వర్కింగ్ డే. పైగా వర్షాలు గట్టిగానే కురుస్తున్నాయి. చాలా ఏరియాలు జలమయమయ్యాయి. సోషల్ మీడియాలో నెగిటివిటీ కూడా ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ 2వ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ పర్వాలేదు అనిపిస్తున్నాయి. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం.. 2వ రోజు ‘హరిహర వీరమల్లు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా రూ.10 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాకి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా చూసుకుంటే.. ఈ సినిమా కలెక్షన్స్ ఇంకొంచెం పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.