బిగ్‌బాస్ హౌస్‌లో గేమ్ ఎంత ముఖ్యమో, యాంగర్ మేనేజ్‌మెంట్ అంత ముఖ్యం, అన్నింటి కంటే సిట్యువేషన్ అర్థం చేసుకోవడం ఇంకా ముఖ్యం. ఈ మూడు చేస్తే ఇంట్లో 100 రోజులు ఉండటం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇంత కంపోజ్డ్‌గా ఉండేవాళ్లకు అభిమానులు ఎప్పుడూ ఓట్లు వేస్తారు. అలా బిగ్‌బాస్ 4 సీజన్‌లో కనిపించిన పార్టిసిపెంట్ హారిక. టమోటా జ్యూస్ టాస్క్ సందర్భంగా… తనను టార్గెట్ చేసిన వారిని హారిక ఫేస్ చేసిన విధానం సూపర్ అసలు. అక్కడికక్కడ కోపం చూపించకపోవడమే కాక… తర్వాతి సందర్భంలో కూడా సిచ్యువేషన్‌ను అర్థం చేసుకొని మాట్లాడటం బిగ్‌బాస్ అన్‌సీన్‌లో చూపించారు.
టమోటా టాస్క్‌లో బాగా చేయలేదంటూ బిగ్ 2000 పాయింట్లు ఇచ్చిన తర్వాత… అందరూ ఎవరి పనుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. హారిక, ఆరియానా మాత్రమే బయట లాన్‌లో మాట్లాడుకున్నారు. టాస్క్‌లో తమ టీమ్ చేసిన పల్ప్‌ను ఎందుకు రిజక్ట్ చేశారో అడిగితే చెప్పలేదని, అది తనను బాధించిందని చెప్పుకొచ్చింది. అయితే దాని ముందు సిచ్యువేషన్ నుంచి వచ్చిన స్ట్రెష్‌ను బాగా హ్యాండిల్ చేసింది.
తనను తాను చీర్‌అప్ చేసుకొని ఆరియానాతో మాట్లాడటం చాలా బాగుందని నెటిజన్లు అంటున్నారు. సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం ఎంత ముఖ్యమో, ఇంకొకరు తమ గురించి చెప్పినప్పుడు అంతే జాగ్రత్తగా వినడమూ ముఖ్యం. మోనాల్ తన గురించి తాను చెబుతున్నప్పుడు హారిక జాగ్రత్తగా వినింది.
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ ఇంట్లో అభిజీత్ లాంటోడు ఉండాల్సిందే!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?