బిగ్ బాస్4 : అమ్మ ఎన్ కౌంటర్.. హారిక కౌంటర్.!

బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం జరిగిన నామినేషన్స్ తో హౌస్ హీటెక్కిపోయింది. ముఖ్యంగా అభిజిత్ తన సెకండ్ నామినేషన్ గా అమ్మరాజశేఖర్ మాస్టర్ దగ్గరకి వచ్చి రీజన్ చెప్తూ గుడ్డు పగలకొట్టాడు. అక్కడ ఇద్దరికీ పెద్ద యుద్ధమే జరిగింది. ఎప్పుడైతే నోయల్ టాపిక్ వచ్చిందో అప్పుడు మాస్టర్ తన విశ్వరూపాన్నిచూపించాడు. నోయల్ కూడా తక్కువేం తినలేదు అని, డిప్ప మీద కొట్టేవాడని, తన మనసులో చాలా పెట్టుకుని మరీ బండోడా బండోడా అంటూ టార్చర్ చేశాడని, ఇది నేను ఎప్పుడు ఎవరికీ చెప్పలేదని తన ఆవేదనని చెప్పాడు. వాడెవడు నన్ను పనిష్మెంట్ చేయడానికి , వాడికోసం నువ్వు సపోర్ట్ చేయడం అస్సలు కరెక్ట్ కాదని చెప్పాడు. ఈ విషయం అసలు నేను వదిలేశా, కానీ నువ్వే ఇప్పుడు కెలికావ్ అంటా ఫైర్ అయ్యాడు.

ఇదే మీ ప్రాబ్లమ్ మాస్టర్ ఎదుటివారిని అస్సలు మాట్లాడనివ్వరు, మీరు చెప్పిందే వినాలి.. ఇదే రీజన్ తో మిమ్మల్ని నేను నామినేట్ చేస్తున్నాను.. అని రెండు మూడుసార్లు గట్టిగా చెప్పాడు. దీన్ని కూడా మాస్టర్ వెటకారం చేసాడు. మధ్యలో అవినాష్ వచ్చి కల్పించుకుంటుంటే, అభిజిత్ అవినాష్ కి కౌంటర్ వేశాడు. హారిక టాపిక్ వచ్చేసరికి, హారిక అవినాష్ కి కౌంటర్ వేయబోయింది. అమ్మకి చెప్పబోయింది. ఇక్కడే అమ్మరాజశేఖర్ హారికని నువ్వు నోర్మూయ్ అస్సలు మాట్లాడకు అంటూ ఆవేశంతో ఊగిపోయాడు.

దీనికి హారిక ఫుల్ ఎటాక్ చేసింది. అసలు నన్ను నోర్మూయ్ అని ఎందుకు అంటున్నారు అంటూ రెచ్చిపోయింది. ఇదే రీజన్ తో తర్వాత వచ్చి అమ్మరాజశేఖర్ మాస్టర్ ని నామినేట్ చేసింది. అభిజిత్ తో జరిగిన కౌంటర్ ఎటాక్ లో అమ్మ నోరుజారాడు. అయినా సారీ కూడా చెప్పలేదు. నోయల్ విషయంలో బాగా హర్ట్ అయిన అమ్మ -అవినాష్ ఇద్దరూ కూడా హారిక అండ్ అభిజిత్ పై మాటలు విసిరారు. దీంతో హారిక కూడా గట్టిగానే సమాధానం చెప్పింది. మొత్తానికి ఈవారం నామినేషన్స్ లో వీళ్ల నలుగురే హైలెట్ అయ్యారు. అంతేకాదు, మోనాల్ ని అఖిల్ నామినేట్ చేయడం అనేది హౌస్ మేట్స్ తో పాటుగా ఆడియన్స్ ని సైతం ఆశ్చర్యపరిచింది. అదీ మేటర్.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus