Harika: అప్పుడు మరదలిగా చేసి ఇప్పుడు తల్లిగా చేసిందా?

త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే సినిమాల్లో కథలతో పాటు, నటీనటులు కూడా చాలా సిమిలర్ గా కనిపిస్తూ ఉంటారు అని చెప్పాలి. కొంతమంది ఆర్టిస్ట్.. లని త్రివిక్రమ్ తన సినిమాల్లో రిపీట్ చేస్తూ ఉంటారు. సునీల్, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి.. వంటి నటీనటులు త్రివిక్రమ్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. గతంలో నటించిన నటీనటులను కూడా త్రివిక్రమ్.. తన కొత్త సినిమాలకి తీసుకుంటూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. సరే ఆ విషయాలు పక్కన.. పెట్టేస్తే , ఇటీవల ‘గుంటూరు కారం’ సినిమా వచ్చింది.

ఇందులో శ్రీలీల హీరోయిన్. ఆమె తండ్రి పాత్రలో మురళీ శర్మ నటించాడు. వీళ్ళ పాత్రల వల్లే కథ ముందుకు వెళ్తుంది. అయితే శ్రీలీలకి తల్లిగా నటించిన ఆమెను ఎవ్వరూ పెద్దగా నోటీస్ చేసి ఉండరు. ఎందుకంటే ఆమె పాత్రకి ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా ఉండదు. చెప్పుకోవడానికి జస్ట్ అలా నిలబడుతుంది సెట్ ప్రాపర్టీలా అంతే..! అయితే ఆమె ప్రేక్షకులకి పరిచయమున్న నటే..! గతంలో మహేష్ బాబు – త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అతడు’ సినిమాలో త్రిషకి అక్క పాత్రలో ఆమె నటించిందని కొంతమంది అంటున్నారు.

అంటే ఆ సినిమాలో పార్ధుకి మరదలి పాత్రలో అనమాట. ఆమె పేరు (Harika) హారిక అట. గతంలో ఆమె కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ‘రాజాబాబు’ ‘అందగాడు’ ‘ఎవడి గోల వాడిదే’ వంటి సినిమాల్లో ఆమె నటించిందట. అయితే ‘గుంటూరు కారం’ లో ఒక్క డైలాగ్ కూడా లేని పాత్రలో ఆమె కనిపించిందని నెటిజన్లు జోకులు వేసుకుంటున్నారు.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus