టాలీవుడ్ లో ఏ పాత్రలో అయినా ఒదిగిపోయి మరీ జీవించే నటులలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ముందు ప్లేస్ లో ఉంటాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే అదే క్రమంలో ఒక పాత్ర చేస్తున్నాం అంటే ఆ పాత్రపై అధ్యయనం చెయ్యడం, ఆ పాత్రను గురించి పూర్తిగా తెలుసుకుని ట్రై చెయ్యడం ఎన్టీఆర్ కి అలవాటు…అదే క్రమంలో అధుర్స్ సినిమాలో ఎన్టీఆర్ బ్రాహ్మిన్ పాత్రను ఉతికి ఆరేసాడు అన్న సరిపోదు. అయితే అలాంటి పాత్రనే డీజెలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వేశాడు. సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బన్నీ ప్రయత్నాన్ని ఎవ్వరూ వేలెత్తి చూపించడంలేదు…ఇంకా చెప్పాలి అంటే బన్నీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ విషయంలో దర్శకుడు హరీష్ మాత్రం కాస్త ఘాటుగా మాట్లాడుతూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సెటైరికల్ కౌంటర్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి…అసలు మ్యాటర్ లోకి వెళితే….
లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిన డీజెకి డిజాస్టర్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే…అయితే సినిమాలో బన్ని వేసిన బ్రాహ్మణ పాత్ర ఇదవరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన అదుర్స్ చారి పాత్రకు దీన్ని ముడిపెట్టి చూస్తూ ఉన్న క్రమంలో ఈ విషయంపై డిజె థ్యాంక్స్ మీట్ లో డైరక్టర్ హరిష్ మరోసారి ఫైర్ అయ్యాడు. హీరో బ్రాహ్మణుడుగా చెసిన సినిమాలు చాలా తక్కువ మైకెల్ మదన కామరాజులో కమల్ హాసన్, ముగ్గురు మొనగాళ్లులో చిరంజీవి, అదుర్స్ లో ఎన్.టి.ఆర్ అంటూ పోల్చి చెప్పాడు. తను చెప్పదలచుకున్న పాయింట్ ఏంటంటే అదుర్స్ ఎన్.టి.ఆర్ కన్నా బన్ని అంత గొప్పగా ఏం చేయలేదు అన్నదానికి క్లారిటీ ఇస్తూ బన్నిని పైకెత్తే, ఎన్టీఆర్ కన్నా బన్నీనే బాగా చేశాడు అనే విధంగా మాట్లాడాడు. తప్పులేదు…సినిమా ఇచ్చిన హీరో కనుక హీరోని సమర్దించుకోవడం, హీరోని వెనుక వేసుకు రావడం కొర్రేక్టే…కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హరిష్ శంకర్ ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా చేశాడు కాబట్టి బన్ని వైపు ఉండి అన్ని మాటలంటున్నాడు. ఎప్పుడో ఒకసారి మళ్లీ ఎన్.టి.ఆర్ తో సినిమా చేయాల్సి వస్తే కష్టమే కదా. ఏది ఏమైనా… ఇరువురూ హీరోలు డిఫరెంట్ జొనర్స్ లో చేస్తున్న ప్రయత్నాలను మనం అభినందించాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.