Harish Shanakar: హరీశ్‌ శంకర్‌ ఈసారి ఇంకాస్త గట్టగా ప్లాన్‌ చేస్తున్నాడుగా

  • April 17, 2021 / 04:47 PM IST

పవన్‌ కల్యాణ్‌తో సినిమా అనగానే హరీశ్‌ శంకర్‌ ఎంత ఆనంపడ్డాడో తెలియదు కానీ, హరీశ్‌ శంకర్‌ డైరక్షన్‌లో పవన్‌ సినిమా అనగానే పవన్‌ అభిమానులు మాత్రం చాలా ఆనందపడ్డారు. కారణం ‘గబ్బర్‌సింగ్’లో పవన్‌ను హరీశ్‌ శంకర్‌ చూపించిన తీరే. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ పని చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్‌ పోస్టర్‌ విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్‌ అవుతోంది.

హరీశ్‌ శంకర్‌ ఇప్పటికే పవన్‌ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు చేస్తున్నాడు. ఆ క్రమంలో సినిమా పవన్‌ ఐబీ ఆఫీసర్‌ అని వార్తలు వచ్చాయి. దీనిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ సినిమాలో పవన్‌ డ్యూయల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడని మరో పుకారు మొదలైంది. ఇదే నిజమైతే పవన్‌ కెరీర్‌లో ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో ‘తీన్‌మార్‌’లో పవన్‌ డబుల్‌ రోల్‌లో కనిపించాడు. అయితే ఆ సినిమాలో రెండు పాత్రలను ఒకేసారి చూసే అవకాశం ఉండదు. కానీ హరీశ్‌ శంకర్‌ సినిమాలో ఆ అవకాశం ఉందట.

పవన్‌ కల్యాణ్‌ 28వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్‌ తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపిస్తాడట. ఒక పాత్ర పోలీసు అయితే, రెండో పాత్ర ఐబీ ఆఫీసర్‌ అని తెలుస్తోంది. పవన్‌ ఖాకీ వేస్తే ఎలా ఉంటుందో ‘గబ్బర్‌సింగ్‌’లో హరీశ్‌ చక్కగా చూపించాడు. ఇప్పుడు మరోసారి ఆ అవకాశం ఇస్తే ఇక ఏ రేంజిలో అదరగొడతాడో చూడాలి.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus