‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ కోసం డేట్‌ సెంటిమెంట్‌… ఎందుకంటే?

రీమేక్‌ సినిమా అయినా సరైన దర్శకుడు, హీరో చేతిలో పడితే… ఒరిజినల్‌ సినిమా అంత బలమైన హిట్‌ కొడుతుంది అని అంటుంటారు. దీనికి నిలువెత్తు నిదర్శనం ‘గబ్బర్‌ సింగ్‌’. హిందీలో భారీ విజయం అందుకున్న ‘దబంగ్‌’ సినిమాను తెలుగులోకి తీసుకొచ్చి ఇండస్ట్రీ హిట్‌ కొట్టారు పవన్‌ కల్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌. ఈ సినిమా వచ్చి పదేళ్లు పూర్తవుతోంది. ఇప్పుడు ఇన్నాళ్లకు మళ్లీ ఈ కాంబో కలిసింది. అయితే అప్పుడు పాటించిన సెంటిమెంట్‌నే ఇప్పుడూ పాటించారట.

చాలా రోజుల తర్వాత మొదలైన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ రెండో షెడ్యూల్‌ పూర్తయింది. ఈ విషయాన్ని చెబుతూ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ఈసారి పెర్ఫార్మన్స్ బద్దలై పోద్ది’ అని గ్లింప్స్‌లో చెబితే… ఇప్పుడు షెడ్యూల్ అయిపోయింది అని చెబుతూ… ‘ఎక్స్‌ప్లోడింగ్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు’ అని రాసుకొచ్చారు. దీంతో ఆయన పోస్ట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతోపాటు ఓ నెటిజన్‌ పోస్ట్‌ను రీపోస్ట్‌ చేశారు హరీశ్‌ శంకర్‌.

అయితే, ఆ పోస్ట్‌లో రాసిన ఓ విషయం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. పదేళ్ల క్రితం ‘గబ్బర్ సింగ్’ సినిమాకు పాటించిన ఓ సెంటిమెంట్‌ ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు పాటించారు అని చెబుతున్నారు. జనవరి 17, 2022న ‘గబ్బర్‌ సింగ్‌’ ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ షూట్‌ చేస్తే… ఇప్పుడు అంటే సెప్టెంబరు 27, 2023న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ఇంటర్వెల్‌ సీన్‌ తీశారు అని రాసుకొచ్చారు. అయితే ఇందులో ఏం సెంటిమెంట్‌ ఉంది అనేది తెలియడం లేదు.

అయితే ఆ ట్వీట్‌ను ఇంకాస్త డీప్‌గా డీకోడ్‌ చేస్తే ఒక అంశం కనిపిస్తోంది. అందులో ఒకటి నెంబర్‌ 7. రెండు తేదీల్లోనూ 7 ఉంది. దీంతో నెంబర్‌ 7 అనేది సెంటిమెంట్‌ అనుకోవచ్చు అంటున్నారు. అయితే ఆ పోస్ట్‌ను రీపోస్ట్‌ చేస్తూ హరీశ్‌ శంకర్‌ థ్యాంక్స్‌ మాత్రమే చెప్పారు. ఆ సెంటిమెంట్‌ ఏంటో కూడా చెబితే క్లారిటీ వచ్చేసేది. అయితే త్వరలో మరో ఆసక్తికర సమాచారం ఇస్తాను అని తొలి పోస్ట్‌లో అన్నారు. చూడాలి ఏం చెబుతారో?

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus