Pawan Kalyan: పవన్ సినిమా గురించి సింబాలిక్‌ హింట్ ఇచ్చిన హరీష్ శంకర్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో.. ఎ.దయాకర రావు నిర్మాతగా.. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ మీద సీనియర్ అండ్ సూపర్ హిట్ ప్రొడ్యూసర్ ఎ.ఎమ్.రత్నం సమర్పిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం.. ‘హరి హర వీరమల్లు’.. పవన్ కెరీర్‌లో తెరకెక్కుతున్న ఫస్ట్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ఇది.. బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలకపాత్రల్లో కనిపిచంనున్నారని సమాచారం.. కొంత గ్యాప్ తర్వాత ఇటీవలే షూటింగ్ స్టార్ట్ చేశారు..

రీసెంట్‌గా లొకేషన్‌లో పవన్ కళ్యాణ్‌ని డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాతలు, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి కలిశారు. దర్శకుడు క్రిష్‌తోనూ ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలే నెట్టింట వైరల్ అవుతున్నాయి.. పవన్, హరీష్ కాంబోలో బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్’ తర్వాత గతేడాది ‘భవదీయుడు భగత్ సింగ్’ అనౌన్స్ చేశారు కానీ తర్వాత దాని గురించి ఎలాంటి సమాచారమూ లేదు.. కట్ చేస్తే..

ఈమధ్య ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారని.. తమిళ్‌లో దళపతి విజయ్ నటించిన ‘తేరి’ (పోలీసోడు) సినిమాని రీమేక్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.. రీమేక్ వద్దు.. అందులోనూ ఆ సినిమా అస్సలు వద్దు అంటూ పవన్ ఫ్యాన్ రాసిన ఓ లెటర్ కూడా వైరల్ అవుతోంది.. ఈ నేపథ్యంలో పవన్‌ని హరీష్, నిర్మాతలతో వెళ్లి కలవడం చర్చనీయాంశంగా మారింది.. పవన్ గెటప్ బాగుందని కామెంట్స్ వస్తున్నాయి. అలాగే హరీష్ గ్రీన్ టీషర్ట్‌లో కనిపించాడు..

‘గ్రీన్ టీషర్ట్ వేసుకుని పవన్ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని మాకు ఇండికేషన్ ఇస్తున్నావ్ హరీష్ అన్నా’ అంటూ రీ ట్వీట్ చేస్తున్నారు.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.. 17వ శతాబ్దంలో మెఘల్ సామ్రాజ్యానికి చెందిన వీరమల్లు జీవితం ఆధారంగా.. భారీ బడ్జెట్, టాప్ టెక్నికల్ వాల్యూస్‌తో ‘హరి హర వీరమల్లు’ రూపొందుతుంది.. 2023 వేసవికి విడుదల చేయనున్నారని అంటున్నారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus