Harish Shankar: మారుతి స్టైల్‌నే ఎంచుకున్న హరీశ్‌!

సినిమా ఇంతుంటే.. ప్రచారం అంతుంటుంది. చాలా రోజులుగా ఈ మాట మనం వింటూనే ఉన్నాం. అంటే విషయం తక్కువ.. విశేషణాలు ఎక్కువ అన్నట్లు. సినిమా రిలీజ్‌కు ముందు కాకుండా.. సినిమా షూటింగ్‌ మొదలవ్వగానే ప్రచారం, బజ్‌ క్రియేట్‌ చేస్తున్నారు. స్టార్‌ హీరోల సినిమాలైతే ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే టాలీవుడ్‌లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితికి దూరంగా ఉన్న స్టార్‌ హీరో సినిమా ప్రభాస్‌ది ఒకటుంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా గురించే ఇదంతా.

ప్రభాస్‌ – మారుతి కాంబినేషన్‌ అంటే.. ఓ పట్టాన జీర్ణించుకోవడం కష్టమే అభిమానులకు. ఇద్దరి ఇమేజ్‌లు వేరు. వర్క్‌ స్టైల్స్‌ వేరు, జోనర్‌లు వేరు.. ఇలా చాలానే వేరుగా ఉన్నాయి. దీంతో ఈ కాంబో అంటే చిన్నసైజ్‌ భయం ఉంది అభిమానుల్లో. దీంతో ఈ సినిమా గురించి ఎక్కడా ఎలాంటి ప్రచారం లేదు. అటు టీమ్‌, ఇటు ఫ్యాన్స్‌ ఎక్కడా మాట్లాడటం లేదు. అయితే సినిమా వాయు వేగంతో షూటింగ్‌జరుపుకుంటోందట. తాజాగా ఇలాంటి ఆలోచనే హరీశ్‌ శంకర్‌ కూడా చేయాలి అని కొంతమంది అభిమానులు సూచిస్తున్నారు.

పవన్‌ కల్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆదివారం ఈ సినిమా ముహూర్తం కూడా అయ్యింది. అయితే ఈ సినిమా రీమేక్‌ అనే విషయం ఇప్పటికే బయటకు వచ్చింది. క్లాప్‌ బోర్డు మీద కూడా ‘రచన – దర్శకత్వం : హరీశ్‌ శంకర్‌’ అనే ఉంది. దాని లెక్కన ఈ సినిమా రీమేక్‌ అని తేలిపోయింది. అది ‘తెరి’ సినిమా రీమేకే అని అంటున్నారు.

ప్రస్తుతం పవన్‌ అభిమానులు ఈ విషయంలో చాలా గుర్రుగా ఉన్నారు. కొత్త కథ తీయాల్సిందే అంటూ పట్టుపడుతున్నారు. దీంతో హరీశ్‌ శంకర్‌ ప్రచారాలు మానుకొని మారుతిలా సినిమా తీసేసి విడుదల చేయాలని కొంతమంది నెటిజన్లు సూచిస్తున్నారు. సినిమా అవుట్‌పుట్‌తో మెస్మరైజ్‌ చేస్తే.. అభిమానులు ఆ సినిమా రీమేకా? ఒరిజినలా? అనేది చూడరని సూచిస్తున్నారు. మరి హరీశ్‌ శంకర్‌ ఏమంటారో చూడాలి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus