కోలీవుడ్ లో భారీ సినిమాలను తెరకెక్కించే శంకర్, మురుగదాస్ లకు కొత్తవారిని ప్రోత్సహించే అలవాటు ఉంది. కొత్త కథలతో వచ్చిన వారిని డైరెక్టర్లుగా వెండితెరకు పరిచయం చేస్తుంటారు. నిర్మాతగాను మంచి విజయాలను అందుకున్నారు. టాలీవుడ్ లోను ఈ సంప్రదాయం ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. సుకుమార్ నిర్మాతగా మారి కుమారి 21 ఎఫ్ సినిమాని నిర్మించారు. ఈ మూవీ మంచి హిట్ సాధించింది. రీసెంట్ గా దర్శకుడు అనే సినిమాని సమర్పించారు. కొత్త టీమ్ కి బ్యాక్ బోన్ గా నిలిచారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా నిర్మాతగా మారి చిన్న సినిమాలను నిర్మించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
తొలిసారిగా నితిన్ తో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. అలాగే అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాని తో ఓ మూవీ నిర్మించాలని భావిస్తున్నారు. ఇదే బాటలో గబ్బర్ సింగ్ డైరక్టర్ హరీష్ శంకర్ నడవనున్నారు. నిర్మాతగా మారి చిన్న చిత్రాలను తీయాలనుకున్నట్లు తెలిసింది. కథ సహకారంతో పాటు అంతా యువ బృందంతో తక్కువ బడ్జెట్ తో సినిమా నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. నిర్మాతగానూ ఆయన మంచి విజయాలను అందుకోవాలని ఫిల్మీ ఫోకస్ కోరుకుంటోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.