తెలుగు ప్రేక్షకులకు హర్షవర్ధన్ అనే పేరు వింటే చాలు చిరునవ్వు గుర్తుకొస్తుంది. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని ఈ నటుడు, టెలివిజన్ చరిత్రలో ఎవర్‌గ్రీన్‌గా నిలిచిన అమృతం సీరియల్‌తో ఊహించని స్థాయిలో ప్రజాదరణ పొందారు. గుండు హనుమంతరావుతో కలిసి ఆయన చేసిన సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. ఆ సీరియల్ ఇచ్చిన గుర్తింపే హర్షవర్ధన్ కెరీర్‌కు బలమైన పునాది అయింది.
కాలక్రమేణా టీవీ నుంచి సినిమాల వైపు అడుగులు వేసిన హర్షవర్ధన్, సహజ నటనతో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి, క్యారెక్టర్ ఓరియెంటెడ్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా మద్యపానం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలంటూ చెప్పిన మాటలు చాలామందిని ఆలోచింపజేశాయి. ఒక ప్రముఖ హీరో తండ్రిని చూసి తాను ఈ విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు.. మన తెలుగు హీరో నితిన్ వాళ్ళ తండ్రి నిర్మాత సుధాకర్ రెడ్డి గారు అంట. ఆల్కహాల్ తీసుకునే ముందు ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగేసి, ఆ తరువాత ప్రతి పెగ్గు తరువాత ఒక గ్లాస్ వాటర్ తాగితే సరిపోతుందని, ఇలా చేస్తే ఆల్కహాల్ యొక్క ప్రభావం శరీరం మీద చాల తక్కువగా ఉంటుందని చెప్పారట.
కెరీర్ విషయానికి వస్తే, శాంతి నివాసం, కస్తూరి వంటి సీరియల్స్‌తో పాటు ఎన్నో సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేశారు. మధ్యలో విరామం తర్వాత వచ్చిన సినిమాలు ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్‌ను ఇచ్చాయి. గత ఏడాది పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన హర్షవర్ధన్, తాజాగా ప్రేక్షకుల మెప్పు పొందిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.