Mahesh Babu : సూపర్ స్టార్ హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్నారా..?

  • May 17, 2021 / 11:55 AM IST

వయసు పెరిగే కొద్దీ అందం తగ్గుతూ ఉంటుంది. అందుకే హీరోయిన్లు యంగేజ్ లో ఉన్నప్పుడే వీలైనన్ని సినిమాలు చేసి సంపాదిస్తుంటారు. వయసు పెరుగుతుందనే ఫీలింగ్ రాకుండా తమ అందం కోసం నానాపాట్లు పడుతుంటారు. రకరకాల కాస్మొటిక్స్ వాడడంతో పాటు వ్యాయామాలు, డైట్లు చేస్తూ తెగ కష్టపడుతుంటారు. హీరోల పరిస్థితి కూడా ఇంతే. సూపర్ స్టార్ మహేష్ బాబుకి 45 ఏళ్లు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఇరవై ఏళ్ల కుర్రాడిలా ఉంటారు. ఎంతో ఫిట్ గా ఉండడంతో పాటు చాలా అందంగా కనిపిస్తుంటారు.

మహేష్ బాబు హెయిర్ స్టైల్ అంటే చాలా మందికి ఇష్టం. అయితే నిజమైనా జుట్టా..? లేక విగ్గా..? అనే విషయంలో చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. మహేష్ హెయిర్ రియల్ అంటూ కొందరు.. కాదని మరికొందరు కామెంట్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో మహేష్ బాబు గతంలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అత్యాధునిక హెయిర్ ప్యాచ్ టెక్నాలజీ ద్వారా మహేష్ తన తల మీద కుట్టు అమర్చుకున్నట్లు తెలుస్తోంది.

దీన్ని నాన్ సర్జికల్ హెయిర్ ఫిక్సింగ్ అంటారని.. ఇది చూడడానికి సహజమైన జుట్టులాగే కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ హెయిర్ ఫిక్సింగ్ సిస్టమ్ ను బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ లాంటి హీరోలు కూడా చేయించుకున్నారట. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో అతడి హెయిర్ స్టైల్ కు సంబంధించిన చిన్న మార్పులు చేస్తున్నారట. ఈసారి సరికొత్త లుక్ తో మహేష్ కనిపిస్తారట. ఈ సినిమా పూర్తి చేసిన తరువాత మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు!

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus