స్టార్ డైరెక్టర్ ను మూలాన పడేసారుగా..!

మాస్ సినిమాలకి ‘కేర్ అఫ్ అడ్రెస్స్’ అంటే డైరెక్టర్ వినాయక్ పేరే గుర్తొస్తుంది అనడంలో సందేహం లేదు. వినాయక్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం ఎగబడేవారు. వినాయక్ ఇచ్చిన హిట్లు అలాంటివి. కడుపుబ్బా నవ్వించాలన్నా, సుమోలు లేపాలన్నా, హీరోతో విలన్ ని గాల్లో ఎగరేసి కొట్టించాలన్నా… అలాంటి సీన్లు ఎలేవేటే చేయడంలో వినాయక్ తరువాతే ఎవరైనా.. అనేంతలా పాపులర్ అయ్యాడు. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ప్రస్తుతం వినాయక్ చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు. మొన్నటి వరకూ నందమూరి బాలకృష్ణతో సినిమా అన్నారు. కానీ ఆ సినిమాకి సంబంధించి ఏమాత్రం పనులు మొదలు కాలేదు. ఇక రవితేజకి ఓ లైన్ చెప్పాడన్నారు. వరుసగా మాస్ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు రవితేజ.ఇలాంటి పరిస్థితుల్లో వినాయక్ తో సినిమా చేసే సాహసం చేయలేనని వినాయక్ కు చెప్పి పంపించేసాడట రవితేజ. ఇక చేసేదేం లేక వెంకటేష్ కి ఓ లైన్ చెప్పాడు వినాయక్. అయితే వెంకీ నుండీ ఏ రెస్పాన్స్ లేకపోగా… ‘వెంకీమామ’ తో బిజీ అయిపోయాడు.తరువాత నక్కిన త్రినాధరావుతో వెంకీ ఓ సినిమా చెయ్యబోతున్నాడు. సో ఇండైరెక్ట్ గా వినాయక్ ను రిజెక్ట్ చేసినట్టే..! ఇలా ఈ స్టార్ డైరెక్టర్ ను అందరూ మూలాన పడేసారు. ఈ పరిస్థితుల్లో వినాయక్ కు ఏ హీరో ఛాన్స్ ఇస్తాడో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus