మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కి కేరళ హైకోర్టు షాకిచ్చింది. గతంలో 2018లో ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఉన్ని ముకుందన్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో అతడిపై ఉన్న స్టే ఆర్డర్ ను విత్ డ్రా చేస్తూ కోర్టు ఉతర్వులు జారీ చేసింది. ఉన్ని ముకుందన్ పై ఉన్న లైంగిక వేధింపుల కేసుని కోర్టులో కాకుండా బయటే పరిష్కరించుకోవడానికి సదరు యువతి అంగీకరించినట్లుగా ఉన్ని ముకుందన్ తరఫు న్యాయవాది సైబీ జోస్ కిడంగూర్ కొన్ని పత్రాలను కోర్టుకి సమర్పించారు.
అయితే తాను ఎలాంటి సంతకం చేయలేదని.. అవి తప్పుడు పత్రాలని ఆ యువతి కోర్టులో వాంగ్మూలం ఇవ్వడంతో హైకోర్టు సీరియస్ అయింది. దీనికి సమాధానం చెప్పాలంటూ ఉన్ని ముకుందన్ తరఫు లాయర్ ని ఆదేశించింది. 2018లో కొట్టాయం పట్టణానికి చెందిన యువతి ఉన్ని ముకుందన్ తనను లైంగికంగా వేధించారని.. ఆ ఏడాది సెప్టెంబర్ 15న పోలీసులను ఆశ్రయించింది. ఆగస్టు 23న స్టోరీ డిస్కషన్ కోసమని పిలిచి తనను లైంగికంగా వేధించాడని.. ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది.
దీంతో పోలీసులు ఉన్ని ముకుందన్ పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. అయితే ఈ కేసుని ఉన్ని ముకుందన్ తరఫున సైబీ జోస్ కిడంగూర్ వాదించారు. ఈ నేపథ్యంలో బాధిత యువతి ఈ కేసుని కోర్టులో కాకుండా బయటే పరిష్కరించేందుకు అంగీకరించినట్లుగా ఒక ఫోర్జరీ పత్రాన్ని కోర్టుకి సమర్పించారు. దీంతో కోర్టు ఆ కేసుని కొట్టేసింది. ఇప్పుడేమో బాధిత యువతి తాను ఎలాంటి పత్రాల మీద సంతకం చేయలేదని కోర్టులో వాంగ్మూలం ఇవ్వడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.
దీనిపై కోర్టు ఉన్ని ముకుందన్ న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఉన్ని ముకుందన్ పై ఉన్న స్టే ఆర్డర్ ను విత్ డ్రా చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కేసులో ప్రత్యుత్తర అఫిడవిట్ దాఖలు చేయాలని ఉన్ని కృష్ణన్ ను ఆదేశిస్తూ కేసును ఈ నెల 17కి వాయిదా వేసింది కోర్టు. నటుడిగా ఉన్ని ముకుందన్ కి మలయాళంలో మంచి డిమాండ్ ఉంది. తెలుగులో కూడా ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’ వంటి సినిమాల్లో కనిపించారు. రీసెంట్ గా ‘యశోద’ సినిమాలో కీలకపాత్ర పోషించారు.
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!