హెబ్బాకి పెళ్లైపోయిందా..?

‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ హెబ్బా పటేల్ ఆ తరువాత వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. కానీ హిట్ ట్రాక్ ని మైంటైన్ చేయలేకపోయింది. ‘భీష్మ’, ‘ఒరేయ్ బుజ్జిగా’ లాంటి చిత్రాల్లో చిన్న రోల్స్ లో కనిపించి తన స్టేచర్ మరింత తగ్గించుకుంది. దీంతో ఆమెకి అవకాశాలు కరువయ్యాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ మెడలో పసుపుకొమ్ముతో దర్శనమిచ్చింది. పసుపుకొమ్ము కనిపించే విధంగా ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చింది. దీంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అభిమానులంతా.. ఈ ఫోటోలపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘ఏంటి నిజంగానే పెళ్లయిందా..?’ అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే.. మరికొందరు ఈ ట్రెడిషనల్ లుక్ లో అందంగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి హెబ్బాకి ఇప్పటికే ముప్పై ఏళ్లు దాటిపోయాయి. కాబట్టి ఆమె పెళ్లి చేసుకున్నా.. పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఆమె మెడలో పసుపుకొమ్ము కనిపించడమే ఆశ్చర్యం. ఎందుకంటే హెబ్బా పెళ్లి చేసుకోవాలనుకుంటే గ్రాండ్ గానే చేసుకోవచ్చు. ఇలా పసుపుకొమ్ముతో కానిచ్చేయాల్సిన పనిలేదు.

మరి ఈ పసుపుకొమ్ము ఎందుకు కట్టుకుందా అని ఆరా తీయగా.. ఆమె ప్రస్తుతం ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాలో హెబ్బా పేదింటి అమ్మాయిగా.. ఎలాంటి మేకప్ లేకుండా కనిపించనుంది. అందులో పెళ్లి సీన్ కోసం ఇలా మెడలో పసుపుకొమ్ముతో కనిపించింది. షూటింగ్ మధ్యలో గ్యాప్ తీసుకొని ఇలా ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ బ్యూటీ.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus