రామ్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా త్రినాధ్ రావ్ నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం 2018 వ సంవత్సరం అక్టోబర్ 18న విడుదలైంది. నేటితో ఈ చిత్రం విడుదలై 3 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత’ విజయవంతంగా దూసుకుపోతున్న టైములో ఎటువంటి అంచనాలు లేకుండా పక్కన ఈ చిత్రం విడుదలయ్యింది. ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రాన్ని కొంచెం అటు ఇటు తిప్పి తీసినట్టుగా ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించారు.
ఫైనల్ గా ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందంటే :
నైజాం | 7.70 cr |
సీడెడ్ | 2.90 cr |
ఉత్తరాంధ్ర | 2.98 cr |
ఈస్ట్ | 1.30 cr |
వెస్ట్ | 0.92 cr |
గుంటూరు | 1.30 cr |
కృష్ణా | 1.27 cr |
నెల్లూరు | 0.63 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 19.10 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.59 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 20.69 cr |
‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రానికి రూ.17.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.20.69 కోట్ల షేర్ ను రాబట్టింది.దాంతో బయ్యర్లకు రూ.3 కోట్ల వరకు లాభాలు దక్కినట్టు అయ్యింది. ‘హైపర్’ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వంటి పరాజయాలతో సతమతమవుతున్న రామ్ కు ఈ చిత్రం రిలీఫ్ ను ఇచ్చిందనే చెప్పాలి.
Most Recommended Video
మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!