వందకుపైగా పాటలు పాడడంతోపాటు ఒక రెండు సినిమాలకు సంగీత దర్శకుడిగానూ పనిచేసిన అనుభవం ఉన్న హేమచంద్రకు సడన్ గా సింగింగ్ ఛాన్సులు సన్నగిల్లుతున్నాయి. నిన్నమొన్నటివరకూ సినిమాల్లో పాటలు, యాంకరింగ్, ఫారిన్ త్రిప్స్ అంటూ యమ బిజీగా లైఫ్ ను గడిపిన హేమచంద్ర ఇటీవల సతీమణి శ్రావణ భార్గవి ఆడపిల్లకి జన్మనివ్వడంతో కాస్త ఫారిన్ టూర్ ను పక్కనపెట్టి ఇంటికి పరిమితమయ్యాడు. ఏదో పాటలు పాడుకుంటూ కాలం వెళ్లదీస్తున్న హేమచంద్రకు ఉన్నట్లుండి సింగింగ్ ఆఫర్లు తగ్గాయి.
ఎందుకా అని ఆరాతీయగా.. ఇటీవల హేమచంద్ర “ధృవ” సినిమాలో స్టైలిష్ విలన్ అరవిందస్వామికి డబ్బింగ్ చెప్పాడు. సమంతకి చిన్మయి వాయిస్ ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిందో.. అరవిందస్వామికి హేమచంద్ర డబ్బింగ్ అంతకంటే బాగా సింక్ అయ్యింది. స్వయంగా అరవిందస్వామే తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకొన్నాడేమో అనే స్థాయిలో డబ్బింగ్ సింక్ అయ్యింది. ఇంతకుమునుపు “బిచ్చగాడు” సినిమాలో హీరో విజయ్ ఆంటోనీకి కూడా హేమచంద్ర డబ్బింగ్ చెప్పడం విశేషం. దాంతో.. ఇప్పుడు హేమచంద్రకి వరుసబెట్టి తమిళ విలన్స్, హీరోల పాత్రలకు డబ్బింగ్ చెప్పే అవకాశాలు వెల్లువెత్తాయి. దాంతో హేమచంద్రకి సింగర్ గా కంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.