బాలీవుడ్ స్టార్స్ తో నిండిపోతున్న ఆదిపురుష్..!

యాక్షన్ హీరో ప్రభాస్ ని డెరెక్టర్ ఓంరౌత్ ఆది పురుష్ గా మార్చిన సంగతి తెలిసిందే. ఇందులో రాముడిగా ప్రబాస్ ని వెండితెరపై చూపించబోతున్నాడు డైెరక్టర్. సుమారు 500కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాకి ఇప్పుడు స్టార్ కాస్టింగ్ ని శరవేగంగా ఎంపికచేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన రోజుకో అప్ డేట్ బాలీవుడ్ టౌన్ లో చక్కర్లు కొడుతోంది. నిన్న మొన్నటిదాకా సీతగా కృతిసనన్ ని ఎంపికచేశారని వార్తలు వినిపించాయి.

అలాగే, లక్ష్మణుడిగా టైగర్ ష్రాఫ్ ని ఎంపికచేసినట్లుగా కూడా టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో హేమమాలినిని తీస్కున్నారని మరో టాక్. కీలకమైన పాత్రలో ప్రభాస్ తల్లిగా హేమమాలిని నటించబోతోందని చెప్తున్నారు. కౌసల్య దేవి పాత్రలో హేమమాలిని ఉండచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, రీసంట్ గా హేమమాలిని సినిమాలకి చాలా దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఇది చాలా ప్రస్టేజియస్ పాత్ర కాబట్టి ఒప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక రావణాసురిగా సైఫ్ అలీఖాన్ ఈ క్యారెక్టర్ కోసం బాడీబిల్డింగ్ చేస్తున్నాడు.

దానికి తగ్గట్లుగానే ప్రభాస్ కూడా ఈ సినిమాకోసం స్పెషల్ జిమ్ కోచ్ ని అపాయింట్ చేస్కున్నట్లుగా చెప్తున్నారు. సలార్ మూవీ యాక్షన్ సీన్స్ చేసిన తర్వాత ఈ సినిమాకి డేట్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సంవత్సరంలో షూటింగ్ ఫినిష్ చేయాలని గట్టి ప్లాన్ తో ఉంది ఆదిపురుష్ మూవీ టీమ్. అదీ మేటర్.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus