Hema: జైలు నుంచి బయటకు వచ్చిన హేమ.. అలా కామెంట్లు చేస్తూ?

  • June 14, 2024 / 11:06 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో ఒకరైన హేమకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కొన్నిరోజుల క్రితం అరెస్ట్ అయిన హేమ తాజాగా బెయిల్ పై విడుదలయ్యారు. స్థానిక కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హేమ తరపు న్యాయవాది మాట్లాడుతూ హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ ను జప్తు చేసుకోలేదని ఘటన జరిగిన పది రోజులకు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.

హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు ఎలాంటి సాక్ష్యాలు అందించలేదని హేమ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే సీసీబీ న్యాయవాది హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు చూపే ఆధారాలను కోర్టుకు అందించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేయడం జరిగింది. ఈ క్రమంలో శుక్రవారం రోజున హేమ జైలు నుంచి రిలీజ్ అయ్యారు.

హేమ జైలు నుంచి రిలీజైన తర్వాత సెక్యూరిటీ పోస్ట్ దగ్గర ఉన్న సిబ్బంది ఆమెను ప్రశ్నించగా ఆమె బర్త్ డే పార్టీ అని జవాబిచ్చారు. మీడియాతో మాట్లాడాలని హేమ పక్కన ఉన్న వ్యక్తి సూచించినా ఆమె మాట్లాడలేదు. “వీళ్లకు చెప్పాల్సిన అవసరం ఏముంది” అంటూ హేమ అక్కడినుంచి వెళ్లిపోయారు. హేమ మీడియా విషయంలో ప్రవర్తించిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హేమ విడుదలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో హేమ కేసుకు సంబంధించి ఏవైనా మలుపులు చోటు చేసుకుంటాయేమో చూడాల్సి ఉంది. హేమ ఈ కేసు నుంచి బయటపడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. హేమ కెరీర్ పై ఈ కేసు ప్రభావం చూపుతుందో లేదో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags