Balakrishna: ఎవరూ చూపించని విధంగా బాలయ్యను చూపిస్తారట!

బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి డైరక్షన్‌లో ఓ సినిమా ఉంటుందనే విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ సినిమా గురించి బాలయ్య అనౌన్స్‌ చేశారు. అప్పటివరకు లీక్‌గా మాత్రమే ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను ‘అన్‌స్టాపబుల్‌’ కార్యక్రమంలో అనౌన్స్‌ చేసేశారు బాలయ్య. ఆ తర్వాత సినిమా కథ ఇదీ అంటూ ఓ పుకారు సోషల్‌ మీడియాలో, టాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తూ వచ్చింది. అయితే ఎక్కడా అనిల్‌ రావిపూడి కానీ, బాలయ్య కానీ అఫీషియల్‌గా చెప్పలేదు. ఇప్పుడు అనిల్‌ చెప్పేశారు. లీక్‌ అయిన కాన్సెప్ట్‌ని కన్ఫామ్‌ చేసేశారు.

‘ఎఫ్‌ 3’ సినిమా విడుదలై, ప్రచారం, సందడి, పనులు అన్నీ అయ్యాక బాలయ్య సినిమా కథ మీద కూర్చోబోతున్నారట అనిల్‌ రావిపూడి. ఇప్పటివరకు అనిల్‌ తీసిన సినిమాలు వినోదంతో కూడుకున్నవే. హీరోయిజం ఉన్నప్పటికీ కామెడీనే ప్రధానమైన ఎలిమెంట్‌గా చూపిస్తూ వచ్చారు. అయితే బాలయ్యతో చేసే సినిమా మాత్రం చాలా తేడా ఉంటుంది. ఇప్పటివరకు తన నుండి రాని జోనర్‌లో ఈ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు అనిల్‌ రావిపూడి.

అంతేకాదు ఇప్పటివరకు బాలయ్యను ఎవరూ చూపించని విధంగా ఈ సినిమా ఉండబోతోంది అని కూడా చెప్పారు అనిల్‌. తండ్రి – కూతురు మధ్య నడిచే కథతో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు అనిల్‌ రావిపూడి. తండ్రిగా బాలయ్యగా కనిపిస్తే… కూతురుగా శ్రీలీల కనిపిస్తుందట. ఈ సినిమాలో బాలయ్య పాత్ర సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తిగా చూపిస్తారట. అయితే సినిమా మొత్తం బాలకృష్ణ పాత్ర చుట్టూనే తిరుగుఉతందట. ఆ పాత్ర ఎలా నడుస్తుందో సినిమా అలా నడుస్తుందట.

అంటే బాలయ్య పాత్రే సినిమా అని చెప్పొచ్చు అని చెప్పారు అనిల్‌ రావిపూడి. ‘పోకిరి’, ‘గబ్బర్ సింగ్’, ‘అర్జున్ రెడ్డి’ సినిమాలు హీరో పాత్ర చుట్టూ తిరుగుతాయి. ఇప్పుడు బాలయ్యతో చేయబోయే సినిమా కూడా అలానే ఉండబోతోంది అని చెబుతున్నారు అనిల్‌ రావిపూడి. ఆ సినిమాల టెంప్లేట్‌లోనే ఓ కథను అనుకున్నామని, త్వరలో దాన్ని పూర్తిగా సిద్ధం చేసి… మొదలుపెడతామని చెప్పారు దర్శకుడు. మరి తన ట్రేడ్‌ మార్క్‌ కామెడీ జోనర్‌ నుండి బయటికొస్తున్న అనిల్‌ రావిపూడి సినిమాను ఎలా తెరకెక్కిస్తారో చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus