‘గుంటూరు కారం’, ‘సైంధవ్’, ‘నా సామి రంగా’.. ఇలా ముగ్గురు అగ్ర హీరోలతో పోటీకి సిద్ధంగా ఉన్నాడు ‘హను – మాన్’. సినిమా విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జాకు అంత ధైర్యం ఏంటి అనే ప్రశ్న గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో వినిపిస్తూనే ఉంది. దానికి వాళ్లిద్దరూ చెప్పేమాట.. ‘సినిమా చూస్తే మీకు తెలుస్తుంది’. ఎందుకంటే సినిమాలో అన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి అంటున్నారు. అవేంటో తెలియదు కానీ… సినిమా కథ ఎలా ఉంటుందో చూచాయగా తెలిసింది.
సంక్రాంతి బరిలో ఉన్న ఐదు నాలుగు సినిమాల్లో చిన్న సినిమా అంటే ‘హను – మాన్’ అనే చెప్పాలి. భారతీయ తొలి సూపర్ హీరో అంటూ ఈ సినిమాను ప్రారంభించారు. సినిమా టీజర్లు, ట్రైలర్లు చూశాక ఇందులో హనుమంతుడి భక్తుడిగా హీరో తేజ కనిపిస్తాడు అని తెలిసింది. అయితే అసలు కథ ఏంటి అనేది మాత్రం ఇంకా ఎక్కడా లీక్ అవ్వలేదు. అయితే స్క్రీన్ మీద సినిమా విజువల్ వండర్ అని అంటున్నారు. ఇలాంటి సినిమా సంక్రాంతి బరిలో ఉంటేనే కిక్ అని అంటున్నారు.
ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ ఓ సీక్వెన్స్ షూటింగ్ పూర్తి చేయడానికి రెండేళ్లు పట్టింది అని చెప్పారు. ఇక సినిమా కథ గురించి మాట్లాడుతూ ఇది హనుమంతుడి భక్తుడి కథ. ధర్మం కోసం ఆ భక్తుడు నిలబడినప్పుడు హనుమంతుడు ఎలా సాయం చేశాడు. ఎలా తన పవర్స్‌ను ఇచ్చి ఆ వ్యక్తిని సూపర్ హీరో చేశాడు అనేదే సినిమా కథ అని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు. అంతేకాదు ఈ సినిమా కథ రెండు రకాలుగా ఉంటుంది అని చెప్పారు.
సినిమా స్టార్టింగ్‌లో హీరో సూపర్ హీరోలా ఉండడట. ఒక మామూలు కుర్రాడు తన నిత్య ప్రయాణంలో ఓ కీలక సమయంలో సూపర్ పవర్స్ పొందుతాడు. ఎందుకు, ఎలా పొందాడు… అవొచ్చాక ఏం చేశాడు అనేదే సినిమా కథ అట. మరి ఆ కథ పూర్తిగా తెలియాలంటే జనవరి 12 వరకు ఆగాల్సిందే.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!