నందమూరి ఫ్యామిలీ హీరోలు త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు ఇవే..

  • February 9, 2023 / 07:29 PM IST

నటరత్న ఎన్టీఆర్.. ఆ మహానటుడి పేరు చెప్తే.. రాముడు, కృష్ణుడు వంటి దేవుళ్ల రూపాలు కళ్లముందు కదలాడుతాయి. పౌరాణిక పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో తనదైన ముద్ర వేశారాయన. రెండు, మూడు కంటే ఎక్కువ క్యారెక్టర్లు చేసి ప్రేక్షకాభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆయన తర్వాత నట వారసుడు బాలకృష్ణ కూడా తండ్రి బాటలోనే పయనిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మూడో తరం నుండి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా నటరత్న నట వారసత్వాన్ని కొనసాగిస్తూ.. తమదైన శైలిలో రాణిస్తున్నారు.

విశేషమేంటంటే.. రామారావు నుంచి ఆయన మనవళ్ల వరకు త్రిపాత్రాభినయం చేశారు. అప్పటి ఎన్టీఆర్ నుండి ఇప్పటి నందమూరి కళ్యాణ్ రామ్ వరకు ట్రిపుల్ రోల్ చేసిన నందమూరి కథానాయకులు ఎవరో ఇప్పుడు చూద్దాం..

నటరత్న ఎన్టీఆర్..

విశ్వవిఖ్యాత నట సౌర్వభౌమ నందమూరి తారక రామారావు తొలిసారిగా ‘దాన వీర శూర కర్ణ’ చిత్రంలో కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడు వంటి మూడు విభిన్న పాత్రలు పోషించారు. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా తన నటనా చాతుర్యంతో ఆబాలగోపాలాన్నీ అలరించారు. అలాగే ‘కుల గౌరవం’, ‘శ్రీ కృష్ణ సత్య’, ‘శ్రీమద్విరాట పర్వం’, ‘శ్రీమద్విరాట వీరబ్రహ్మేంద్ర చరిత్ర’ వంటి పలు చిత్రాలలో మూడు, అంతకంటే ఎక్కువ పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు.. ‘దాన వీర శూర కర్ణ’ చిత్రానికి దర్శక నిర్మాత కూడా రామారావే కావడం మరో విశేషం.. హరికృష్ణ అర్జునుడు, బాలకృష్ణ అభిమన్యుడు క్యారెక్టర్లలో కనిపించారు..

నటసింహ నందమూరి బాలకృష్ణ..

నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఫస్ట్ టైం ‘అధినాయకుడు’ ఫిలింలో మూడు రోల్స్ ప్లే చేశారు.. తాత, తండ్రి మరియు మనవడిగా.. హరిశ్చంద్ర ప్రసాద్/రామకృష్ణ ప్రసాద్/బాబీ అనే క్యారెక్టర్లలో వేరియేషన్స్ చూపించారు.. పరుచూరి మురళీ డైరెక్ట్ చేశారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ నందమూరి థర్డ్ జెనరేషన్ హీరో, ‘జై లవ కుశ’ చిత్రంలో ట్రిపుల్ రోల్ చేసి ఆకట్టుకున్నాడు.. కుశ అనే దొంగగా, బ్యాంక్ ఉద్యోగి లవ కుమార్, రావణ్ అనే అన్నదమ్ముళ్ళ పాత్రలకు తన నటనతో ప్రాణం పోశాడు.. రావణ (జై) క్యారెక్టర్‌లో నత్తిగా మాట్లాడి అలరించాడు.. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ప్రాణాలు పోతుండగా జై పాత్రలో జీవించేశాడు తారక్.. కె.ఎస్. రవీంద్ర (బాబి) దర్శకుడు..

నందమూరి కళ్యాణ్ రామ్..

తమ్ముడు తారక్ తర్వాత అన్నయ్య, టాలెంటెడ్ యాక్టర్ నందమూరి కళ్యాణ్ రామ్ కూడా మూడు పాత్రలు పోషించాడు.. కెరీర్ స్టార్టింగ్ నుండి.. నటుడిగా, నిర్మాతగా.. కొత్త దర్శకులకు అవకాశమిస్తూ.. డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఛాలెంజింగ్ రోల్స్ చేసి ఆకట్టుకుంటున్న కళ్యాణ్ రామ్.. ‘అమిగోస్’ మూవీలో మూడు వైవిధ్యభరితమైన క్యారెక్టర్లు, సరికొత్త గెటప్స్‌లో కనిపించనున్నాడు. రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు..

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus