Kiraak RP: నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు.. ఊరిస్తుంది, ధరలు బెదిరిస్తున్నాయి..!

  • January 30, 2023 / 07:42 PM IST

ఏ జిల్లాకు చెందిన వారికైనా సరే రుచికరమైన చేపల పులుసు తినాలి అని ఆశపడుతుంటారు. గోదావరి జిల్లాల్లో చేపల పులుసు చాలా బాగుంటుంది. అయితే గోదావరి జిల్లాల చేపల పులుసునే డామినేట్ చేసే విధంగా నెల్లూరు చేపల పులుసు ఫేమస్. అవును తెలుగు రాష్ట్రాల్లో రుచికరమైన చేపల పులుసు లభించేది ఈ రెండు జిల్లాల్లోనే..! అయితే ఎక్కువగా నెల్లూరు చేపల పులుసే పాపులర్. ఇదిలా ఉండగా.. జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ..

ఓ కర్రీ పాయింట్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎక్కువ మంది చెఫ్‌ లు లేకపోవడంతో కొన్నాళ్ళు ఆపేశాడు. తర్వాత నెల్లూరు వెళ్లి.. అక్కడ చేపల పులుసు వండటంలో చేయి తిరగినవారిని తీసుకుని వచ్చి చెఫ్ లుగా పెట్టుకుని.. మళ్లీ రీ ఓపెన్ చేశాడు. కూకట్‌పల్లిలో ఈ కర్రీ పాయింట్ ఉంది. బ్రాంచ్ లు వంటివి ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇక్కడి చేపల పులుసుకు మంచి డిమాండ్ ఉంది. నెల్లూరు వారి స్లైల్లో మామిడికాయ వేసి.. పులుసును వందిస్తున్నాడు ఆర్పీ.

చేపలు కూడా అక్కడివే తెప్పిస్తున్నట్టు వినికిడి. సన్న చేపల పులుసు, కొరమీను పులుసు, బొమ్మిడాయిల పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు వంటివి ఈ కర్రీ పాయింట్లో లభిస్తున్నాయి. అయితే ఇక్కడి చేపల పులుసు యొక్క ధరలు తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.

బొమ్మిడాయిల పులుసు – 375 రూపాయలు

చేప తలకాయ పులుసు – 200 రూపాయలు

కొరమేను పులుసు – 375 రూపాయలు

రవ్వ చేపల పులుసు – 285 రూపాయలు

సన్న చేపల పులుసు 250 రూపాయలు

(వైట్ రైస్ – 75 రూపాయలు, రాగి సంగటి – 100 రూపాయలు).

ఈ చేపల పులుసు ధరలు … చికెన్ బిర్యానీ కంటే కాస్ట్లీ గా కనిపిస్తున్నాయి. అయినా జనాలు ఎగబడుతున్నారు. ఇన్నాళ్టికి తెలంగాణ ప్రజలకు అసలు సిసలైన చేపల పులుసు రుచి తెలిసిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus