Aakash: సెన్సేషనల్‌ హీరో ఆకాశ్‌.. ఇలా వచ్చేశాడేంటి.. ఎందుకనో?

టాలీవుడ్‌లో కొంతమంది హీరోలు ఎలా వస్తారో తెలియదు కానీ.. చేసిన తొలి సినిమాతోనే టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయిపోతారు. ఆ తర్వాత కొంతమంది ఎక్కువ రోజులు నిలబడితే.. ఇంకొంతమంది కొద్ది రోజులకే వెళ్లిపోతారు. ఆ తర్వాత ఎంతగా ప్రయత్నించినా.. సినిమాల్లో సరైన అవకాశాలు రావు. వచ్చినా అవి కెరీర్‌కి ఉపయోగపడవు. అలా ఒక వెలుగు వెలిగి తర్వాత డౌన్‌ అయిపోయిన హీరోల్లో ఆకాశ్‌ ఒకరు. అదేనండీ ‘ఆనందం’ ఆకాశ్‌. ఆయన ఇప్పుడు టీవీల్లోకి వచ్చారు.

వెండితెరపై మెరిసిన హీరోలు తర్వాత వ్యాపారాలలో సెటిల్ అవ్వడం చూశాం. మరికొందరు సైడ్ క్యారక్టర్స్‌ చేస్తూ సెటిల్ అవుతున్నారు. మరికొందరు అయితే వెండి తెర నుండి బుల్లితెరకు పరిచయం అవుతున్నారు. అలాంటి వారిలో ఆకాశ్ ఇప్పుడు చేరారు. ‘ఆనందం’, ‘పిలిస్తే పలుకుతా’, ‘నవ వసంతం’ లాంటి సినిమాలతో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆకాశ్‌.. ఆ తర్వాత నిన్నటితరం నటుడు అనేలా వెనుకబడిపోయాడు.

తెలుగు, తమిళ చిత్రాలతో మెప్పించిన ఆకాశ్‌ సీరియల్స్‌లోకి వస్తున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. సెట్స్‌ నుండి ఫొటోలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఆకాష్ తన సహనటులు మోనిషా, జబర్దస్త్ సన్నీ, ఇతరులతో కలిసి ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. అందులో ఆకాష్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నాడు. ఈ కొత్త సీరియల్‌ గురించి మరిన్ని వివరాలు త్వరలో బయటకు వస్తాయని తెలుస్తోంది. ఇక ఆకాశ్ సంగతి చూస్తే… శ్రీలంక మూలాలున్న తమిళ నటుడు.

లండన్‌లో స్థిరపడిన ఆకాశ్‌ 1999లో ‘రోజావనం’ అనే సినిమాలో నటనతో మంచి పేరు సంపాదించాడు. ఆ తర్వాత 2001లో తెలుగులో వచ్చిన ‘ఆనందం’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సినిమా విజయంతో ఆకాశ్ క్రేజ్ పెరిగిపోయింది. అయితే ఆ క్రేజ్‌ను అంతగా కంటిన్యూ చేయలేకపోయాడు. ఇప్పుడు సీరియల్స్‌లో ఏం చేస్తాడో చూడాలి. అన్నట్లు ఈ సీరియల్‌ జెమిని టీవీలో ప్రసారం అవుతుందని సమాచారం. ఈ సీరియల్‌కు ‘గీతాంజలి’ అనే పేరును ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. అయితే ఆకాశ్‌ తమిళంలో ఇప్పటికే సీరియల్స్‌లో అదరగొడుతున్నాడు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus