భార్యల కోసం ప్రొడ్యూసర్లవుతున్న స్టార్ హీరోలు

ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ ది స్క్రీన్ కూడా మేము హీరోలమే అని ప్రూవ్ చేసుకోవడం కోసం మన స్టార్ హీరోలు చాలా పాట్లు పడుతుంటారు. కానీ.. తమిళ స్టార్ సూర్య మాత్రం తన మంచితనంతోనే దాన్ని సాధించేస్తాడు. ఫ్యామిలీ మేన్ గా సూర్యకు ఉన్న ఇమేజ్ సౌత్ ఇండియాలో మరే స్టార్ హీరోకు లేదు. తన పిల్లల పేర్ల మీద బ్యానర్ ను స్థాపించి, తన భార్య ప్రధాన పాత్రలో సినిమాలు నిర్మించడం ఆయనకు మాత్రమే చెల్లింది.

సినిమాలు నిర్మించడం మాత్రమే కాదు సొషల్ మీడియాలో ఆమె మీద జనాలు జ్యోతిక మీద ఆమె చేసిన “గుడి కట్టించడం కంటే బడి కట్టించడం మేలు” కామెంట్ గురించి ఫైర్ అవుతున్న తరుణంలో ఆమెకు అండగా నిలిచి మంచి భర్త అనిపించుకున్నాడు. ఇప్పుడు ఇదే బాటలొ తమిళ నటుడు ఆర్య కూడా పయనించడానికి సన్నద్ధమవుతున్నాడు. రెండేళ్ళ క్రితం బాలీవుడ్ భామ సాయేషాను పెళ్లాడిన ఆర్య, ఇప్పుడు ఆమె హీరోయిన్ గా రూపొందే సినిమాలు నిర్మించడం కోసం ఒక హోమ్ బ్యానర్ ను మొదలెట్టే పనిలోపడ్డాడు.

ఇటీవల ఓ యువ దర్శకుడు చెప్పిన కథను మెచ్చిన సాయేషా నటించడానికి ఒకే చెప్పిందట. బయట బ్యానర్ లో చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో తెలిసిన ఆర్య ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. మరి సాయేషా సెక్ండ్ ఇన్నింగ్స్ జ్యోతికలా హిట్ అవుతుందో లేదో చూడాలి. ఇకపోతే.. ఆర్య-సాయేషా కలిసి నటించిన “టెడ్డీ” చిత్రం డిస్నీ హాట్ స్టార్ లొ విడుదలకానుంది.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus