Adivi Sesh: హైదరాబాద్ అమ్మాయితో యంగ్ హీరో ప్రేమాయణం!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అడివి శేష్ కి స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. సరికొత్త కథలను ఎన్నుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ‘క్షణం’, ‘గూఢచారి’ లాంటి సినిమాలతో అతడి క్రేజ్ మరింత పెరిగింది. గతంలో ఈ హీరో బాలీవుడ్ అమ్మాయితో ప్రేమాయణం సాగించినట్లు వార్తలు వచ్చాయి. వాటిపై ఈ హీరో ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిలేషన్షిప్ గురించి అడివి శేష్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్ కి చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు ఈ హీరో చెప్పాడు. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఆమె గురించి పూర్తి వివరాలు చెప్పడానికి.. ప్రేయసి దగ్గర అనుమతి తీసుకోలేదని.. కాబట్టి ఇప్పుడు తన గురించి ఏమీ చెప్పలేనని వెల్లడించాడు. దీంతో అడివి శేష్ తన ప్రేయసిని ఎప్పుడు పరిచయం చేస్తాడా..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో మహేష్ బాబు నిర్మిస్తోన్న ‘మేజర్’ సినిమాలో నటిస్తున్నాడు.

అలానే ‘హిట్ 2’, ‘గూఢచారి’ సినిమాల్లో నటిస్తున్నాడు. కాగా.. రీసెంట్ గా ఈ హీరో కోవిడ్ పేషంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న కోఠి ప్రభుత్వ హాస్పిటల్ లో నీటి సమస్యను తీరుస్తూ.. సొంత ఖర్చుతో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ను ఏర్పాటు చేశాడు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus