Ajith: తమిళ హీరో అజిత్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • September 18, 2023 / 10:29 PM IST

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఈ మధ్య కాలంలో అజిత్ యాక్షన్ సినిమాలలో ఎక్కువగా నటిస్తూ ప్రశంసలతో పాటు విజయాలను సొంతం చేసుకున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ లో అజిత్ తర్వాత మూవీ తెరకెక్కుతోందని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. సన్ పిక్చర్స్ సంస్థ అజిత్ కు 150 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చిందని తెలుస్తోంది. భారీ స్థాయిలో పారితోషికం తీసుకోవడం ద్వారా అజిత్ వార్తల్లో నిలుస్తున్నారు.

అజిత్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఈ సినిమాతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. 150 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్న అతికొద్ది మంది నటులలో అజిత్ ఒకరు. రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ మాత్రమే ఇప్పటివరకు ఈ రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు. అజిత్ 63వ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.

అజిత్ కు (Ajith) భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తెలుగులో కూడా అజిత్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అజిత్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. ఏజ్ పెరుగుతున్నా అజిత్ ఎనర్జీ లెవెల్స్ అస్సలు తగ్గడం లేదు. సన్ పిక్చర్స్ ప్రస్తుతం ధనుష్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

సన్ పిక్చర్స్ ప్లానింగ్ మామూలుగా లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సన్ పిక్చర్స్ తర్వాత ప్రాజెక్ట్ లన్నీ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కుతున్నాయని తెలుస్తోంది. అజిత్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags