Star Hero: ఆ స్టార్‌తో నేరుగా మాట్లాడాలంటే అంత ఈజీ కాదట.. ఎవరతనో తెలుసా?

ఈ రోజుల్లో సెల్‌ఫోన్‌ వాడని వాళ్లు ఉన్నారా? అంటే లేరు అనే సమాధానం వస్తోంది. కుదిరితే ఒక్కొక్కరు రెండేసి ఫోన్లు వాడుతున్నారు అనే సమాధానం వస్తుంది కూడా. ఇలాంటి సమయంలో ఓ స్టార్‌ హీరో అసలు మొబైల్‌ వాడరు అంటే నమ్ముతారా? డౌటే అని మీరు అనుకుంటే.. ఆ హీరో పేరు చెప్పగానే నిజమా? అని ఆశ్చర్యపోతారు. అతనే తమిళ స్టార్‌ హీరో అజిత్‌. అవును ఆయనకు మొబైల్‌ వాడటం పెద్దగా ఇష్టం ఉండదట. మరి కమ్యూనికేషన్‌ ఎలా అనేగా మీ డౌట్‌. దానికి ఆన్సర్‌ ఈ వార్త.

అజిత్‌ – మొబైల్‌ విషయం బయటకు రావడానికి కారణం త్రిష. ఇటీవల ఆమె సినిమా ప్రచారంలో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులోనే అజిత్‌ విషయం బయటకు వచ్చింది. ‘అజిత్ ఫోన్ నెంబర్ మీ సెల్ ఫోన్‌లో ఏమని సేవ్ చేసుకున్నారు?’ అని అడిగితే.. అసలు అజిత్‌ మొబైల్‌ వాడితే కదా.. నాకు నెంబరు ఇవ్వడానికి, నేను సేవ్‌ చేసుకోవడానికి అని త్రిష చెప్పింది. దీంతో అజిత్‌ మొబైల్‌ వాడడు అనే మేటర్‌ బయటకు వచ్చింది. అజిత్‌ సన్నిహితుల్ని అడిగితే ఈ విషయంలో ఇంకాస్త క్లారిటీ వస్తుంది.

మొబైల్‌ లేకుండా అజిత్‌ కాంటాక్ట్‌ ఎలా, ఆయనకు ఏదైనా విషయం చెప్పాలన్నా, ఆయన ఏదైనా అడగాలన్నా కష్టమే కదా అనుకుంటున్నారా? ఎంత మాత్రం కాదు అంటున్నారు ఆయన సన్నిహితులు. సినిమాలకు సంబంధించిన విషయాలు, తన ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తన మేనేజర్ ద్వారానే తెలుసుకుంటారట అజిత్‌. ఏ విషయం అయినా, అజిత్‌కు మేనేజర్ ద్వారా వెళ్తాయట. దీంతోపాటు మరో విషయం కూడా తెలిసింది.

ఏదైనా సినిమా ప్రారంభానికి ముందు ఆ నిర్మాణ సంస్థ నుండి అజిత్‌ ఓ సిమ్ కార్డు తీసుకుంటారట. ఆ సిమ్ కార్డును సెల్ ఫోన్‌లో వేసి తన మేనేజర్ దగ్గర ఉంచుతారట. ఆ సినిమా వరకే ఆ నెంబరు వాడతారట. అలా సినిమా విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకుంటారట అజిత్‌. సినిమా పనులు అయిపోయాక ఆ నెంబరును తీసేస్తారట.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus