క్యాస్టింగ్ కౌచ్ ఫై సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరో అర్జున్!

సినిమా రంగం రంగుల వల.. మాయ ప్రపంచం.. అదొక లాటరీ.. ఇలా రకరకాల విమర్శలు ఉన్నాయి. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. అమ్మాయిలకు సేఫ్ కాదు అని ప్రచారం జోరందుకుంది. ఈ విషయంపై రోజుకొక హీరోయిన్ తమ అనుభవాన్ని చెప్పుకుంటున్నారు. అన్ని చోట్ల ఉన్నట్టే ఇక్కడ కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని కొందరు చెబుతుంటే.. మరికొంతమంది.. హీరోయిన్ గా కావాలంటే.. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సిందే అంటూ నిర్మొహమాటంగా చెబుతున్నారు. తాజాగా ఈ విషయంపై ఓ స్టార్ హీరో స్పందించడం విశేషం. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ విజయాలు అందుకున్న అర్జున్ క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్స్ చేశారు.

పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని స్పష్టంచేశారు.  ఆ విషయం తెలిసీ.. కూతురు ఐశ్వర్య ను హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేశారా? అంటే.. అవుననే చెప్పారు అర్జున్. “నిజంగానే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. అన్ని రంగాల్లో ఉన్నట్టుగానే సినీ పరిశ్రమలో కూడా ఆ పరిస్థితి ఉంది. అలాగని నా కూతురును సినిమాల్లోకి రాకుండా నేను అడ్డుకోవాలా? నా కూతురినంటే అడ్డుకుంటాను.. మరి మిగతావాళ్ల పరిస్థితి ఏమిటి? నా సహనటులు కొంతమంది వాళ్ల కూతుర్లను హీరోయిన్లుగా పంపిస్తున్నారు. అందరన్నీ చూశాకా నేను హీరోయిన్ కావాలనుకున్న నా కూతురును అడ్డుకోలేదు” అని అర్జున్ వివరించారు. అర్జున్ మాటలు ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus