Gopichand: నాన్నతో ఎక్కువ సమయం గడపలేకపోయా: గోపీచంద్

టాలీవుడ్ హీరో గోపీచంద్ నటించిన ‘పక్కా కమర్షియల్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటించింది. జేక్స్ బిజాయ్ మ్యూజిక్ అందించగా.. బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. ఈరోజు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. మెగాస్టార్ గెస్ట్ గా రానున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా.. దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

మాస్ ఆడియన్స్ కి ఈ ట్రైలర్ బాగానే కనెక్ట్ అయింది. మరోపక్క ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది చిత్రబృందం. రీసెంట్ గా ‘జబర్దస్త్’ షోలో సందడి చేసిన గోపీచంద్, మారుతి తాజాగా క్యాష్ ప్రోగ్రామ్ లో కనిపించారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. హోస్ట్ సుమతో కలిసి గోపీచంద్, మారుతి, బన్నీ వాసు నవ్వులు కురిపించారు. వెల్ కమ్ గిఫ్ట్ లు ఇచ్చి.. సుమ డబ్బులు అడగగా.. గిఫ్ట్ అని చెప్పి డబ్బులు అడుగుతున్నారేంటి..? అంటూ గోపీచంద్ పంచ్ వేశారు.

ఈ ప్రోమో మొత్తం సరదాగా కౌంటర్లు, జోక్స్, పంచ్ లతో సాగింది. ప్రోమో చివర్లో గోపీచంద్ తన తండ్రి ఫొటోను చూసి ఎమోషనల్ అయ్యారు. ‘నా తొమ్మిదేళ్ల వయసులో నాన్నను కోల్పోయాను. నాకు ఇప్పుడు తెలుస్తోంది ఏం కోల్పోయానో.. ఉన్నప్పుడు ఆయనతో ఎక్కువ సమయం గడపలేకపోయాను’ అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు గోపీచంద్. చాలా కాలంలో ఫ్లాపులలో ఉన్న గోపీచంద్ ఒక్క హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ‘పక్కా కమర్షియల్’తో కచ్చితంగా హిట్ అందుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus