రజనీకాంత్ సినిమాలో విలన్ గా గోపీచంద్.. రచ్చ కన్ఫర్మ్

టాలీవుడ్ హీరోగా సినిమాలు చేస్తోన్న గోపీచంద్ ఒకప్పుడు విలన్ గా ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ లాంటి సినిమాలు చేశారు. ఆ తరువాత హీరోగా సినిమాలు కంటిన్యూ చేశారు. వరుస హిట్లు అందుకున్న గోపీచంద్ కి ఈ మధ్య సరైన హిట్టు సినిమా ఒక్కటి కూడా పడలేదు. ప్రస్తుతం ఈ హీరో ‘సీటీమార్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. గోపీచంద్ కి రజినీకాంత్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని సమాచారం.

వివరాల్లోకి వెళితే.. తలైవా హీరోగా దర్శకుడు సిరుత్తై శివ ‘అన్నాత్తే’ అనే సినిమాని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో నయనతార, కీర్తి సురేష్ లాంటి తారలు నటిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో విలన్ గా గోపీచంద్ ని తీసుకోవాలని భావిస్తున్నారట. దర్శకుడు శివకి గోపీచంద్ కి మంచి సాన్నిహిత్యం ఉండడంతో ఆయన గోపీచంద్ ని సంప్రదించి కథ వివరించినట్లు తెలుస్తోంది. విలన్ రోల్ డిఫరెంట్ గా ఉండడంతో గోపీచంద్ కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ గనుక ఈ ప్రాజెక్ట్ అంగీకరిస్తే.. ఆయనలో విలనిజాన్ని మరోసారి వెండితెరపై చూసే ఛాన్స్ దక్కుతుంది!

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus