Kiran Abbavaram Engagement: స్నేహితురాలుతో ఘనంగా కిరణ్ అబ్బవరం నిశ్చితార్థం… ఆమెనే కాబోయే భార్య!
- March 13, 2024 / 10:59 PM ISTByFilmy Focus
‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Rani Gaaru) రీల్ జోడీ ఇప్పుడు రియల్ జోడీ అవుతోంది. గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లను నిజం చేస్తూ కిరణ్ అబ్బవరం తన స్నేహితురాలు కమ్ ప్రియురాలిని నిశ్చితార్థం చేసుకున్నారు. దీంతో రియల్ జోడీగా మారబోతున్నారు. ‘రాజావారు రాణిగారు’ సినిమాలో హీరో హీరోయిన్లు (Kiran Abbavaram) కిరణ్ అబ్బవరం, (Rahasya Gorak) రహస్య గోరక్ నిజ జీవితంలో ఒక్కటి అవుతున్నారు. వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో జరిగింది. ఇరు కుటుంబాలు, కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో బుధవారం రాత్రి ఈ వేడుక జరిగింది.
దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ హీరో హీరోయిన్‌కు అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక వీరి పెళ్లి ఆగస్టులో ఉంటుందని సమాచారం. దీనిపై త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు అని అంటున్నారు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతోనే కిరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఆ సినిమా షూటింగ్‌లోనే కిరణ్, రహస్య మధ్య స్నేహం ఏర్పడింది.

ఆ తర్వాత ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని అంటుంటారు. గతంలో ఇదే విషయమై కిరణ్ దగ్గర ప్రస్తావిస్తే రహస్య తనకు మంచి స్నేహితురాలు మాత్రమే అని చెప్పాడు. అయితే గత కొన్ని రోజులుగా మాత్రం ఇద్దరి పెళ్లి కుదిరింది అని వార్తలొస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రహస్య గురించి కిరణ్‌ను అడిగితే మెలికలు తిరిగిపోయాడు. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవడం ఫిక్స్ అని గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు ఈ విషయాన్ని నిశ్చితార్థంతో ఫిక్స్ చేసేశారు.
‘రాజా వారు రాణిగారు’ తర్వాత ‘ఎస్‌ఆర్ కల్యాణ మండపం’(SR Kalyanamandapam) , ‘సెబాస్టియన్’(Sebastian P.C. 524) , ‘సమ్మతమే’(Sammathame) , ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’(Nenu Meeku Baaga Kavalsinavaadini) , ‘మీటర్’(Meter) , ‘రూల్స్ రంజన్’ (Rules Ranjan) సినిమాతో కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే అవేవీ ఆయనకు అంత ఉపయోగపడలేదు. అయితే సినిమా ఛాన్స్‌లు మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇక రహస్య ఆ తర్వాత ‘షర్బత్’ అనే తమిళ చిత్రంలో నటించారు.
ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు
భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?












