రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం సీతారాం సిత్రాలు. లక్ష్మణ్ , భ్రమరాంబిక, కిశోరి దాత్రక్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా డి.నాగ శశిధర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
సీతారాం సిత్రాలు మూవీ పూజా కార్యక్రమాలు నిర్మాత రాజ్ కందుకూరి, దర్శకులు అశోక్ చేతుల మీదుగా జరిగాయి అలాగే టైటిల్ లోగో ను ప్రముఖ సినిమాటోగ్రఫర్ , డైరెక్టర్ కె.వి.గుహన్ విడుదల చేశారు,
“నువ్వు గెలెవనంత వరకు ఏమీ చెప్పిన అది చెత్తె
ఒక్కసారి నువ్వు గెలిచాక చెత్త
చెప్పిన అది చెరిత్రే” అనే కథాంశం తో రాబోతున్న సీతారాం చిత్రాలు సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది, త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో లక్ష్మణ్ మాట్లాడుతూ… కొత్త కథ, కథనాలు ఉన్న సినిమాల్లో నటించాలని ఉంది, సీతారాం చిత్రాలు అందరిని అలరించే ఒక మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉందని తెలిపారు.
త్వరలో ట్రైలర్ మీ ముందు అలరించబోతుంది.