కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కొడుకు అయిన అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతూ చేసిన చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.’అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై శ్రీమతి గల్లా పద్మావతి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్న రేంజ్ లో ఆ చిత్రం ఆకట్టుకోలేకపోయింది.
కామెడీ వరకు ఓకె అనిపించినా కథనం స్లోగా సాగుతుండడంతో ప్రేక్షకులు పెదవి విరిచినట్టు స్పష్టమవుతుంది. దాంతో కలెక్షన్లు కూడా సో సోగానే నమోదయ్యాయి. మొదటి వీకెండ్ అంటే ‘హీరో’ 2 రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 0.35 cr |
సీడెడ్ | 0.15 cr |
ఉత్తరాంధ్ర | 0.25 cr |
ఈస్ట్ | 0.09 cr |
వెస్ట్ | 0.06 cr |
గుంటూరు | 0.10 cr |
కృష్ణా | 0.07 cr |
నెల్లూరు | 0.05 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.12 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.06 Cr |
ఓవర్సీస్ | 0.08 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.26 cr |
‘హీరో’ చిత్రానికి రూ.5.5 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు రూ.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.1.26 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో 4.74 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ‘బంగార్రాజు’ వంటి పెద్ద చిత్రం పోటీగా ఉండడం.. ‘రౌడీ బాయ్స్’ కూడా డీసెంట్ రన్ ను కొనసాగిస్తుండడంతో ‘హీరో’ కి గట్టి పోటీ ఏర్పడింది. వాటితో పోలిస్తే ఈ చిత్రం టాక్ కూడా తక్కువగానే ఉంది. అందుకే బాక్సాఫీస్ వద్ద ‘హీరో’ పుంజుకోలేకపోతున్నట్టు స్పష్టమవుతుంది.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!