నాకే కాదు ఆయనకు కూడా సినిమా పిచ్చి ఎక్కువ : నాని

‘అన్ స్టాపబుల్’ టాక్ షో తో పాటు స్మిత హోస్ట్ చేస్తున్న ‘నిజం విత్ స్మిత’ టాక్ షో కూడా బాగా పాపులర్ అయ్యింది. ఇందులో పాల్గొనే సెలబ్రిటీలు ఆసక్తికర విషయాలు చెప్పుకొస్తున్నారు. తాజా ఎపిసోడ్ లో నేచురల్ స్టార్ నాని పాల్గొన్నాడు. నేపోటిజం తో పాటు తన కెరీర్ ప్రారంభంలో ఫేస్ చేసిన ఛాలెంజెస్ గురించి చెప్పుకొచ్చాడు. ఈరోజు నాని సెల్ఫ్ మేడ్ స్టార్ అయ్యాడు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అయ్యాడు.

ఎంతో సినిమా పిచ్చి ఉంటే తప్ప అంత కష్టపడటం సాధ్యం కాదు. నానికి అంత సినిమా పిచ్చి ఏర్పడటానికి ఇంట్రెస్టింగ్ రీజన్ ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘నాకు సినిమా పిచ్చి ఎక్కువ. నేను మాత్రమే కాదు .. మా నాన్నకి కూడా ఆయన చిన్నప్పుడు సినిమా పిచ్చి ఎక్కువ ఉండేదట. ఆ పిచ్చితో ఆయన ఏకంగా ఇంట్లో నుండి మద్రాసుకు పారిపోయాడు. అక్కడ ‘విజయ వాహిని స్టూడియో’ గేటు దగ్గర రెండు రోజుల పాటు నిలబడ్డారట.

ఆయన లోపలికి వెళ్తాను అంటే పంపించడం లేదు. ఆ టైంలో మా నాన్నగారిని నాగిరెడ్డి గారి కూతురు చూసింది. ఏ ఊరు అని అడిగితే .. వెనక్కి పంపిస్తారేమోనని మా నాన్న చెప్పలేదు. దీంతో వాళ్ల ఇంటికి తీసుకెళ్లారు.అక్కడే ఓ వారం రోజుల ఉన్నారు. ఆ వారం రోజులు ఆయన్ని చాలా బాగా చూసుకున్నారు. ఆ తరువాత ఆయనను మాటల్లో పెట్టి, ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే మర్చిపోయి చెప్పేశారు.

అంతే .. అక్కడి నుంచి కబురు రావడం .. ఇక్కడి నుంచి మనుషులు వెళ్లి నాలుగు తగిలించి తీసుకు రావడం జరిగింది. మా ఇంట్లో సినిమా పిచ్చి అప్పటి నుండి ఉంది. మా నాన్న యాక్టర్ కాలేకపోయాడు .. నేను అయ్యాను అంతే’ అంటూ నాని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus