నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చెయ్యడం పై నాని క్లారిటీ…!

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కాంబినేషన్లో వస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘వి’. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. నిజానికి ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చెయ్యాలి అనుకున్నారు… కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ ఏర్పడటం … తద్వారా థియేటర్ లు మూతపడటం వల్ల అది కుదర్లేదు. ఇక థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్ధితి కనిపించకపోవడం వల్ల ‘వి’ ని సెప్టెంబర్ 5న అమెజాన్ లో విడుదల చెయ్యబోతున్నట్టు ప్రకటించారు దర్శకనిర్మాతలు.

ఈ క్రమంలో నిన్న ట్రైలర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసలు ‘వి’ లో నెగిటివ్ రోల్ ఎందుకు చేసారు అంటూ నాని కి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి నాని సమాదానమిస్తూ…”ఏ యాక్టర్ అయినా సరే తన అభిమానుల నుండీ లవ్ అండ్ అప్రిషియేషన్ కోరుకుంటాడు. ‘వి’ మూవీ నాకు చాలా స్పెషల్ మూవీ. ఇది నాకు 25వ చిత్రం.నా ల్యాండ్ మార్క్ చిత్రం ప్రేక్షకులకు గుర్తుంది పోవాలి అనే ఉద్దేశంతో ఈ పాత్ర చేశాను.

కచ్చితంగా ఈ చిత్రం అందరినీ థ్రిల్ చేస్తుంది. కచ్చితంగా నా ఫ్యాన్స్ కు ఇది బిగ్ సర్‌ప్రైజ్. నా ఫ్యాన్స్ మాత్రమే కాదు అందరూ ఎంజాయ్ చేస్తారు. ట్రైలర్‌ మొత్తం యాక్షన్‌ ప్యాక్డ్‌గా రెడీ చేశాం.అయితే సినిమాలో మిమ్మల్ని థ్రిల్‌ చేసే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus