టాలీవుడ్‌లో బయోపిక్‌లకు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. “మహానటి”తో (Mahanati) దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) సినీప్రియులకు అలాంటి కథలపై కొత్త కోణాన్ని అందించారు. ఈ సినిమా విజయంతో బయోపిక్‌లపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. తరువాత క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ (NTR Kathanayakudu) భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఇతర బయోపిక్‌లు తెరపైకి వచ్చే ప్రయత్నాలు జరిగినా, అవి పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేకపోయాయి.
ఇప్పుడు టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన బయోపిక్ చర్చకు వచ్చింది. ఆ బయోపిక్ ఎవరిది అంటే, తెలుగు సినిమా గర్వించదగ్గ లెజెండ్స్ బాపు-రమణల జీవిత కధ. బాపు (Bapu) -రమణ (mullapudi venkata ramana) జోడీ తెలుగు సినిమా కథ, శైలికి కొత్త ఒరవడి తీసుకొచ్చిన వారు. వారి కధను తెరకెక్కిస్తే, అది సినీ ప్రియులకు ఒక అనుభవంగా అవుతుందని భావిస్తున్నారు. రచయిత సాయి మాధవ్ బుర్రా (Sai Madhav Burra) తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాపు-రమణల జీవితం తెరపైకి తీసుకురావాలని తనకు సంకల్పం ఉందని చెప్పారు.
వారి పాత్రల కోసం నేచురల్ స్టార్ నాని (Nani), శర్వానంద్ (Sharwanand) హీరోలు కరెక్ట్ సెట్టవుతారని అభిప్రాయపడ్డారు. నాని, బాపు మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని పరిశీలిస్తే, ఈ కాంబినేషన్ మరింత ఆసక్తికరంగా మారుతుంది. నాని బాపు దర్సకత్వంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉంది. అందుకే నాని ఈ పాత్రకు న్యాయం చేయగలడని భావిస్తున్నారు. ఇక శర్వానంద్ తన విభిన్నమైన పాత్రల ఎంపికలోనే , ఎమోషనల్ పాత్రల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకునే సామర్థ్యాన్ని చూపించాడు.
రమణ పాత్రకు తగిన యంగ్ నటుడిగా శర్వా సరైన ఎంపిక అని సాయి మాధవ్ భావిస్తున్నారు. ఈ బయోపిక్‌ను స్క్రిప్ట్‌గా మలచడానికి సాయి మాధవ్ బుర్రా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. పాత తరం సినిమాలపై గొప్ప అవగాహన కలిగిన ఆయన, ఈ ప్రాజెక్ట్‌ను స్వయంగా డైరెక్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదని టాక్.