Tuck Jagadish Release Date: ‘టక్ జగదీష్’ విడుదల తేదీని ఖరారు చేసిన నాని..!

Ad not loaded.

అనుకున్నట్టే అయ్యింది. ‘టక్ జగదీష్’ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటిటిలోనే విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం నాని రివీల్ చేసాడు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న ఈ మూవీ విడుదల కాబోతున్నట్టు అతను క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రం నుండీ ఓ వీడియో బైట్ ను కూడా పోస్ట్ చేసాడు. ‘భూదేవిపురం చిన్న కొడుకు.. నాయుడు గారి అబ్బాయి ‘టక్ జగదీష్’ చెబుతున్నాడు.. మొదలెట్టండి’ అంటూ నాని సినిమాలో చెప్పిన డైలాగ్ తో రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు.

శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో నానితో ఇతను ‘నిన్ను కోరి’ అనే డీసెంట్ లవ్ స్టోరీని తెరకెక్కించాడు. అది బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో ‘టక్ జగదీష్’ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీ పై నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కచ్చితంగా ఈ మూవీని థియేట్రికల్ రిలీజ్ అయ్యేలా చూడాలని అతను చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అది అసాధ్యమనే ఉద్దేశంతో టీం ఓటిటికే ఓటేయాల్సి వచ్చింది.

గతేడాది అంటే 2020లో సెప్టెంబర్ 5న ‘వి’ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. ఆ మూవీ ప్రేక్షకులను నిరాశపరిచింది. సరిగ్గా ఏడాది తర్వాత మళ్ళీ నాని మూవీ ఓటిటిలోనే రిలీజ్ కాబోతుంది. మరి ఈసారి ఫలితం ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందించాడు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus