ఇంటర్వ్యూ : ‘హాయ్ నాన్న’ మూవీ గురించి నాని చెప్పిన ఆసక్తికర విషయాలు!

  • December 7, 2023 / 04:27 PM IST

నేచురల్ స్టార్ నాని,మృణాల్ ఠాకూర్ కలయికలో రూపొందిన మూవీ ‘హాయ్ నాన్న’. ‘వైర ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శౌర్యువ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన మూవీ ఇది. డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి నాని చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం :

ప్ర) ‘హాయ్ నాన్న’ ప్రమోషన్స్ శివరాజ్ కుమార్ గారిని కలిశారు, వెంకటేష్ తో ఓ ఇంటర్వ్యూలో చేశారు..వీటి వెనుక కారణమేంటి?

నాని : ఇందులో కొత్త విషయం ఏమీ లేదు. సినిమా ప్రమోషన్ కోసం చేశాం అంతే..! ‘దసరా’ కి రవితేజ గారితో కూడా ఇంటర్వ్యూ చేశాను.

ప్ర) పాలిటిక్స్ ని కూడా ‘హాయ్ నాన్న’ కోసం వాడారు?

నాని : మా సినిమా డిసెంబర్ 7న రిలీజ్ అవుతుంది. కానీ నవంబర్ 30 న ఎలక్షన్స్ ఉన్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు ఉన్నాయి. మేము ఆ టైంలో ‘హాయ్ నాన్న’ గురించి ఏం ప్రమోట్ చేసినా జనాలు పట్టించుకునే మూడ్ లో లేరు. అందుకే పాలిటిక్స్ మూడ్ కి మేము కూడా వెళ్ళిపోయి మా సినిమాని ప్రమోట్ చేసుకున్నాం. అది ప్లస్ అయ్యింది.

ప్ర) ‘దసరా’ లో నాని ఊర మాస్ అవతార్ లో కొత్తగా కనిపించాడు అని జనాలు అనుకున్న వెంటనే మళ్ళీ మీ కంఫర్ట్ జోన్ కి వెళ్ళిపోయి ‘హాయ్ నాన్న’ చేశారేంటి?

నాని : ‘హాయ్ నాన్న’ నా కంఫర్ట్ జోన్ ఫిలిం ఏమీ కాదు. మొదట్లో లవ్ స్టోరీ చేస్తే అది నా కంఫర్ట్ జోన్ అన్నారు, తర్వాత కామెడీ చేస్తే అది నా కంఫర్ట్ అన్నారు, ఆ తర్వాత ‘జెర్సీ’ లో ఫాదర్ గా ఎమోషనల్ రోల్ చేస్తే అది నా కంఫర్ట్ జోన్ అన్నారు. ఇప్పుడు ‘హాయ్ నాన్న’ నా కంఫర్ట్ జోన్ అంటున్నారు. నేనైతే దేనిని కంఫర్ట్ జోన్ అనుకోను. అలా అనుకుంటే నేను ఇక సినిమాలు మానేయొచ్చు.

ప్ర)‘హాయ్ నాన్న’ చిత్రాన్ని చాలా అగ్రెసివ్ గా ప్రమోట్ చేశారు..?

నాని : నేను కాకపోతే ఎవరు ప్రమోట్ చేస్తారు. నేను చేసిన ఏ సినిమా అయినా సరే రిలీజ్ రోజు వరకు ప్రమోట్ చేయాల్సిన బాధ్యత నాపై ఉంటుంది.

ప్ర) ‘జెర్సీ’ కి ‘హాయ్ నాన్న’ కి సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా?

నాని : రెండూ ఎమోషనల్ గా సాగుతాయి అనే మాట తప్పితే, ‘జెర్సీ’ క్లైమాక్స్ ట్రాజెడీతో నిండి ఉంటుంది. ‘హాయ్ నాన్న’ క్లైమాక్స్ అలా ఉండదు. హ్యాపీగా నవ్వుకుంటూ బయటకి వస్తారు.

ప్ర) హాయ్ నాన్న కథ విన్నప్పుడు మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం ఏమిటి ?

నాని : ప్రతిసారి ఈ ప్రశ్న అడుగుతారు. నేనేదో సమాధానం చెబుతాను. వాస్తవానికి ఆకట్టుకునే అంశం అంటూ స్పెషల్ గా ఏమీ ఉండదు. ఆ టైంకి మనకి ఏదైతే కథ నచ్చుతుందో అది చేస్తాం. దర్శకుడు శౌర్యువ్ ఈ కథ చెప్పినప్పుడు ఈ ఏడాది ఇలాంటి సినిమా ఏమీ రాలేదు కదా, చేస్తే బాగుంటుంది అనిపించింది. చేసేశాను అంతే..!

ప్ర) మీకు స్టార్ ఇమేజ్ వచ్చింది.. కానీ ఇంకా కొత్త దర్శకులతో చేయడం మీ మార్కెట్ కి రిస్క్ అనిపించడం లేదా?

నాని : నా కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా ‘దసరా’. అది కొత్త డైరెక్టర్ తో చేస్తేనే కదా వచ్చింది. మనకి కావాల్సింది మంచి కథ.. అది తెచ్చే సక్సెస్. అలాంటి సక్సెస్ కొత్త డైరెక్టర్ ఇస్తే ఏంటి.. పాత డైరెక్టర్ ఇస్తే ఏంటి..!

ప్ర) సంగీత దర్శకుడిగా హేషమ్ ని తీసుకోవాలనే ఆలోచన ఎవరిది?

నాని : అది అందరం కలిసి తీసుకున్న నిర్ణయం. హేషమ్..90లలో రెహ్మాన్ ఫ్లేవర్ ఉంటుందో పసిగట్టాడు. అందుకే ఇలాంటి సినిమాకి అతనే సంగీత దర్శకుడిగా చేస్తే బాగుంటుంది అని అందరం అనుకున్నాం.

ప్ర) డీవోపీ సాను జాన్ వర్గీస్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

నాని : అతను తెలుగులో చేసిన 3 సినిమాలు నావే కావడం ఆనందంగా ఉంటుంది. నా ఫేవరేట్ డీవోపీలలో అతను కూడా ఒకడు.ఓ కథ కోసం చాలా డెడికేటెడ్ గా పని చేసే టెక్నిషియన్ తను. బ్రిలియంట్ కెమెరామాన్.

ప్ర) మృణాల్ ఠాకూర్ గురించి చెప్పండి?

నాని : యష్ణ పాత్రలో మృణాల్ ఠాకూర్ చాలా నేచురల్ గా చేసింది.

ప్ర) బేబీ కియారా తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

నాని : తను బ్రిలియంట్..! ఇంత చిన్న వయసులో అంత మెమరీ ఎలా అనేది నాకు ఇప్పటికీ అర్ధం కాదు. మా డైలాగులు కూడా పలానా పేజీలో ఏం చెప్పాలో కూడా తను చెప్పేస్తూ ఉండేది. చదువుల పరంగా అయితే తను కలెక్టర్ అయిపోవాలి మరి(నవ్వుతూ). హాయ్ నాన్న లో ఆమె నటన కూడా హైలెట్ అవుతుంది.

ప్ర) శృతి హాసన్ ని ప్రోమోస్ లో చూసి జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు.. పాప తల్లి ఆమేనేమో అని?

నాని : ఆమె పాటలో మాత్రమే ఉంటుంది. ఈ సినిమాలో ఇంకా కొన్ని గెస్ట్ అప్పీరియన్స్ లు, సర్ ప్రైజ్ పాత్రలు ఉన్నాయి.

ప్ర) వైర ఎంటర్‌టైన్‌మెంట్లో చేసిన మొదటి సినిమాని మీ హోమ్ బ్యానర్లో చేసినట్టు ప్రమోట్ చేస్తున్నారు?

నాని : నటుడిగా నేనే చేయాలి. ఇది వాళ్ళకి మొదటి సినిమా. ఎన్నో విషయాలని అర్ధం చేసుకోవాలి. గైడెన్స్ అవసరం. ఇన్నేళ్ళుగా ఇక్కడ ఉన్నాను కాబట్టి నా వంతుగా కొంత గైడెన్స్ ఇస్తూ ప్రమోషన్లో పాల్గొన్నాను అంతే

ప్ర) దిల్ రాజు గారి బ్యానర్లో ‘బలగం’ దర్శకుడు వేణుతో ‘ఎల్లమ్మ’ అనే ప్రాజెక్ట్ చేస్తున్నారట నిజమేనా?

నాని : లేదండీ.. వేణుతో సినిమా చేయాలని ఉంది కానీ.. ఇంకా ఏమీ ఫిక్స్ అవ్వలేదు.

ప్ర) హిట్ 3 కథ మీకు నచ్చలేదు.. అందుకే ఆ ప్రాజెక్ట్ డిలే అవుతుంది అంటున్నారు.. నిజమేనా?

నాని : అందులో నిజం లేదు. హిట్ యూనివర్స్ లో ప్రతి ఆలోచన నా దగ్గరకే ముందు వస్తుంది. కథ జరుగుతోంది. వర్క్ పూర్తయిన వెంటనే మొదలుపెడతాం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus