క్రైమ్ కథలు.. కిల్లర్ కథలు వద్దు నాని.. అంటున్న ఫ్యాన్స్..!

‘భలే భలే మగాడివోయ్’ చిత్రం దగ్గర నుండీ ‘ఎం.సి.ఏ’ చిత్రం వరకూ నాని నటించిన అన్ని సినిమాలు హిట్లే..! అయితే ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా నుండీ నానికి ఎక్కువగా ఫ్లాప్స్ ఎదురవుతున్నాయి. ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది… ఆ తరువాత నాగార్జునతో చేసిన మల్టీ స్టారర్ ‘దేవదాస్’ చిత్రం కూడా పెద్దగా ఆడలేదు. ‘జెర్సీ’ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ముందు వచ్చిన రెండు ఫ్లాప్స్ ను మరచిపోయారు ప్రేక్షకులు. అయితే తరువాత విక్రమ్ కుమార్ డైరెక్షన్లో చేసిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం ఫ్లాప్ కూడా అయ్యింది.

‘అది నాని మార్క్ సినిమాలా ఉంది కానీ.. విక్రమ్ కుమార్ స్టైల్ లో ఉండే సినిమాల్లా లేదు’ అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు. అయినప్పటికీ ‘గ్యాంగ్ లీడర్’ చిత్రానికి పెద్దగా ట్రోల్స్ అయితే రాలేదు. కానీ తాజాగా విడుదలైన ‘వి’ చిత్రం మాత్రం నాని ఫ్యాన్స్ ను కూడా బాగా హర్ట్ చేసిందనే చెప్పాలి. ఈ చిత్రం మొదలైన దగ్గరనుండీ నాని ఫ్యాన్స్ చాలా డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. ‘వి’ సినిమాలో నాని నటన పర్వాలేదు.. కానీ ఆ పాత్ర నానికి అస్సలు సూట్ అవ్వలేదు.

ఇలాంటి పాత్రను అసలు నాని ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు? సినిమా రిలీజ్ కు ముందు నాని.. ‘సైకో కిల్లర్.. సీరియల్ కిల్లర్’ అనే బిల్డప్ ఇచ్చారు.. కానీ సగం సినిమా అవ్వకుండానే హీరోగా ప్రెజెంట్ చేసారు’.. ఈ విషయం పై నాని దర్శకుడిని కనీసం ప్రశించలేదా?’ అన్నవి వారి డౌట్లు. ఏదేమైనా వరుసగా లవ్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు చేసినా పర్వాలేదు కానీ.. క్రైమ్ కథలు, కిల్లర్ టైపు కథల జోలికి పోవద్దు’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నాని అభిమానులు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus